NTV Telugu Site icon

Metro Staff: రోడ్డెక్కిన మెట్రో సిబ్బంది.. జీతాలు పెంపుపై అమీర్ పేట్ లో ధర్నా

Metro Staff

Metro Staff

Metro Staff: హైదరాబాద్ మెట్రో టికెటింగ్ సిబ్బంది ఈరోజు భారీ నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గత రెండు రోజులుగా విధులకు హాజరుకాకపోవడంతో ఆందోళన చేస్తున్న యాజమాన్యం తమ డిమాండ్లకు అంగీకరించకపోవడంతో ఈరోజు మళ్లీ ఆందోళనకు దిగనున్నారు. అమీర్ పేట మెట్రో స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నారు. ఈ నిరసనలో 450 మందికి పైగా మెట్రో టికెటింగ్ సిబ్బంది పాల్గొననున్నారు. ఉద్యోగులకు సంఘీభావంగా, ఇతర కారిడార్లలో కూడా టిక్కెట్ల సిబ్బంది ధర్నా చేయనున్నారు.

Read also: Veera Simha Reddy: ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అనుమతి నిరాకరణ.. అడ్డా మార్చిన బాలయ్య

తమకు ప్రస్తుతం ఉన్న రూ.11 వేలు నుంచి రూ.20 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఐదేళ్ల నుంచి తమకు జీతాలు పెంచడం లేదని స్టేషన్లలోని టికెట్ కౌంటర్, మెయింటెనెన్స్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వాపోయారు. చాలీచాలని జీతాలు ఇవ్వడమే కాకుండా పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని, ఉద్యోగం చేస్తుంటే రిలీవర్ సమయానికి రాకపోతే పట్టించుకోవడం లేదన్నారు. ఒక్కోసారి తినడానికి కూడా సమయం ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read also: Underweight: వయసుకు తగ్గ బరువు లేరా?

2 రోజులుగా ఎల్బీనగర్‌-మియాపూర్‌ కారిడార్‌లో విధులకు హాజరుకాకుండా ధర్నా చేస్తున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని మెట్రో సిబ్బంది వాపోతున్నారు. నిన్న కూడా విధులకు హాజరుకాకుండా నాగోల్ మెట్రో డిపో వద్ద నిరసన తెలిపారు. సిబ్బంది ధర్నాతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని భావించిన యాజమాన్యం పది మంది సిబ్బందిని ఆపరేషన్స్‌ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ)కి చర్చల కోసం ఆహ్వానించింది. సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీ సంస్థ, కియోలిస్, ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు టికెటింగ్ సిబ్బందితో చర్చలు జరిపారు. కార్మికులు తమ వేతనాల పెంపు, మెట్రోలో ఉచితంగా యాక్సెస్‌ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌ లపై పట్టుబట్టారు. వేతనాల పెంపునకు సంబంధించి ఏజెన్సీలు కొంత సమయం కోరినట్లు చర్చల్లో పాల్గొన్న TCMO తెలిపింది. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఇతర కారిడార్లలో టిక్కెట్టు ఇచ్చే సిబ్బందితో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. టికెటింగ్ సిబ్బంది లేకపోవడంతో మెట్రో స్టేషన్లలో స్టేషన్ కంట్రోలర్లు, ఇతర సిబ్బంది టిక్కెట్లు జారీ చేశారు. చర్చలు అసంపూర్తిగా ఉన్నందున ఈరోజు భారీ నిరసనకు పిలుపునిచ్చారు. అయితే మెట్రో స్టేషన్ సిబ్బంది 3రోజులుగా విధులు బహిష్కరిస్తు తమ డిమాండ్ లు పూర్తి చేయాలని చెబుతున్న ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించక పోవడంపై చర్చనీయాంశకంగా మారింది.
Anantapur JNTU: అనంతపురం జేఎన్టీయూలో విద్యార్థి ఆత్మహత్య..