Heavy Rains: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం కర్ణాటక అంతర్భాగం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని, ఎత్తుకు స్వల్పంగా నైరుతి వంగి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు (22)న వానలు కురిసే ఛాన్స్ ఉందని.. బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారి 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ, బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రకటించారు. ఇవాళ కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు.
Read also: Vijay Devarakonda : సుక్కుతో విజయ్ దేవరకొండ సినిమా?
బుధవారం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మాలజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, జోగులాంబ తదితర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. సోమవారం సాయంత్రం నగరంలో వర్షం కురిసింది. ఉదయమంతా ఎండలు మండిపోయాయి. హైదరాబాద్‌లోని సెరిలింగంపల్లి, గచ్చిబౌలి, నాంపల్లి, మోతీనగర్, మూసాపేట్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, బాలాజీనగర్, జీడిమెట్ల, జియాగూడ, కూకట్‌పల్లి, బండ్లగూడ, హయత్‌నగర్, మియాపూర్, ఖైరతాబాద్, బషీర్‌బాగ్ ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
Durga Stotram: మీ కష్టాలు తీరాలంటే మంగళవారం ఈ స్తోత్రాలు వినండి..