తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నది. రోజూ లక్షలాదిమందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చెపడుతున్నారు. ఇందులో భాగంగా పోలీసుల ఆద్వర్యంలో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులకు, వారి కుటుంబసభ్యులకు, వారి బంధువులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ఈరోజు హోంశాఖా మంత్రి,సీపీ ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇస్తోందని, త్వరలోనే రాష్ట్రంలో తిరిగి మాములు జీవనం ఆరంభం అవుతుందని ఇప్పటికే అధికారులు తెలిపారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనడానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్టు హోంశాఖ మంత్రి తెలిపారు.
హైదరాబాద్‌లో మెగా వ్యాక్సిన్ కార్యక్రమం…
