Etala Rajender: Etala Rajender: మేడ్చల్ రైల్వేస్టేషన్ 32 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ రైల్వే స్టేషన్, RUB పనులను పరిశీలించి, రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ కంటే ముందు.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రైల్వే అభివృద్ధి జరగలేదన్నారు. మోడీ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో రెండువేల కోట్లతో.. రైల్వేస్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లలో విమానాశ్రయాలు తలపించే విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. మేడ్చల్ రైల్వేస్టేషన్లో 32 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి, బొల్లారం, అల్వాల్, అమ్మగూడ రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నారని అన్నారు.
Read also: G. Kishan Reddy: నేను ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాను..
మెట్రోరైల్ మాదిరిగా MMTS కి కూడా దగ్గర దగ్గర స్టేషన్లు ఏర్పాటు చేయమని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత సికింద్రాబాద్లో ఉన్న ఉన్నతాధికారులను పంపించారని తెలిపారు. వారితో కలిసి ఈరోజు మల్కాజిగిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని రైల్వేస్టేషన్లను, RUB లను పరిశీలన చేస్తున్నామన్నారు. ఈ ప్రపోజల్స్ అన్నీ ఢిల్లీ తీసుకుపోయి అతి తొందరలో వీటన్నింటిని పరిష్కారం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం తీసుకొని అతి త్వరలో వీటిని పూర్తి చేస్తామని తెలిపారు. బొల్లారం, వినాయకనగర్ గేట్లు రెండు రెండు గంటలు పడుతున్నాయని.. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అమ్మగూడెం అండర్ పాస్ వద్ద ట్రాఫిక్ జాం అవుతుందన్నారు. మరో 20 సంవత్సరాలు ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని అండర్ పాస్ లను అభివృద్ధి చేస్తామన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని రైలు నిలయం, రైల్వే ఆస్తులు, చర్లపల్లి టెర్మినల్, అనేక రైల్వే లైన్లు ఉన్నాయని పేర్కొన్నారు.
TG DSC Hall Tickets: డీఎస్సీ విద్యార్థులు అలర్ట్.. నేడు హాల్ టికెట్లు విడుదల..