Site icon NTV Telugu

Student Suicide: సీనియర్లు ర్యాగింగ్.. మేడిపల్లిలో ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్య..

Medchal

Medchal

Student Suicide: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలోని నారపల్లిలోని మధు బాయ్స్ హాస్టల్ లో ఉంటున్న ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతుంది. సీనియర్లు ర్యాగింగ్ చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని స్నేహితులు పేర్కొంటున్నారు. బలవంతంగా మద్యం తాగించడంతో పాటు బార్ కి తీసుకెళ్లి ఫుల్ గా తాగి 10 వేల రూపాయల బిల్లు కట్టాలని ఒత్తిడి చేశారు.. వారి వేధింపులు తట్టుకోలేక జాదవ్ సాయి తేజ హాస్టల్ రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.

Read Also: Surya Kumar Yadav: ఇకనైనా ఆపండి.. భారత్‌కు పాక్ పోటీ కానే కాదు.. రిపోర్టర్‌లకు ఇచ్చిపడేసిన టీమిండియా కెప్టెన్!

ఇక, సాయి తేజ తండ్రి ప్రేమ్ సింగ్ మాట్లాడుతూ.. నా కొడుకు నిన్న ఉదయం కాల్ చేశాడు.. 1500 రూపాయలు అడిగితే పంపించాను.. నిన్న రాత్రి ఒక వీడియో పంపాడు.. అందులో సూసైడ్ చేసుకుంటున్నాను అని ఉంది.. వెంటనే కాల్ చేశా ఆన్సర్ చేయలేదు.. వాళ్ళ హాస్టల్ వాళ్లకు కాల్ చేశా… అప్పటికే బాబు చనిపోయాడు అని తెలిపారు. సీనియర్లు కొట్టడం, వేధించారని ఆ వీడియోలో చెప్పాడు.. బార్ కి తీసుకుని వెళ్ళారు నా కొడుకుని.. 10 వేల బిల్లు చేసి నా కొడుకుని కట్టమన్నారు.. డబ్బులు లేవు అని చెప్పడంతో నా కొడుకుపై దాడి చేశారు అని ఆరోపించారు. నా కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయి.. హత్య చేసి, పోలీసులు రాకముందే ఉరి వేసుకున్నట్లు నా కొడుకును కిందకు దింపారు అని మృతుడి తండ్రి ప్రేమ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Exit mobile version