NTV Telugu Site icon

Medaram Jatara: తుది ఘట్టానికి చేరిన తెలంగాణ కుంభమేళ..

తెలంగాణాకే తలమానికమైన మేడారం జాతర తుదిదశకు చేరుకుంది. ఈ నెల 16న ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైన తెలంగాణ కుంభమేళ వైభవోపేతంగా జరుగుతోంది. సమ్మక-సారక్క జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ భక్తులు విచ్చేశారు. అమ్మవార్లకు బంగారాన్ని (బెల్లం) సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. సమ్మక్క-సారక్క అమ్మవార్లను రాజకీయ ప్రముఖలు కూడా ఇప్పటికే దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ నేపథ్యలో నేడు తెలంగాణ గవర్నర్‌ తమిళసై కూడా అమ్మవార్లను దర్శించుకోనున్నారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర ఈ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. నేటి సాయంత్రం అమ్మవార్లు వన ప్రవేశం చేయడంతో ఈ జాతర ముగుస్తుంది.

ఎంతో పేరుగాంచిన మేడారం జాతర మరో రెండు సంవత్సరాల తరువాత జరుగనుంది. సమ్మక్క సారక్క మహా జాతరకు సుమారు 2 కోట్లకు మందికి పైగా భక్తులు తరలివచ్చారని అధికారులు వెల్లడించారు. కోరిన కోర్కెలు తీర్చే తమ ఇలవేల్పులకు భక్తులు మనసారా మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్ల దర్శనం కోసం సుమారు నెల రోజుల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. ప్రధాన జాతర బుధవారం ప్రారంభం కాగా గురువారం సమ్మక్క రాకతో జాతర ముఖ్యమైన ఘట్టం మొదలైంది. శుక్రవారం అమ్మవార్లు భక్తులకు అభయం ఇచ్చి.. నేడు తిరిగి వనప్రవేశం చేయనున్నారు.