Site icon NTV Telugu

Medaram Jatara 2022: మేడారం హుండీ లెక్కింపు పూర్తి.. తగ్గిన ఆదాయం..

తెలంగాణ కుంభమేళ, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర వైభవంగా ముగిసిన విషయం తెలిసిందే.. ఇక, జాతర ముగియడం, మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోవడంతో.. హుండీ లెక్కింపు చేపట్టారు.. ఇవాళ సమ్మక్క-సారలమ్మ హుండీ లెక్కింపు పూర్తి చేశారు.. ఈసారి హుండీ ఆదాయం రూ.11 కోట్లను దాటేసింది.. రూ.11 కోట్ల 44 లక్షలు 12 వేల 707 రూపాయలు హుండీ ద్వారా లభించినట్టు ప్రకటించారు.. ఇక, బంగారం 631 గ్రాములు, వెండి 48 కిలోల 350 గ్రాములు భక్తులు సమర్పించినట్టు వెల్లడించారు.. ఈసారి చిల్లర నాణేలు ద్వారా రూ. 37 లక్షల హుండీ ఆదాయం వచ్చిందని తెలిపారు.

Read Also: Rajya Sabha Elections: షెడ్యూల్ విడుదల.. 6 రాష్ట్రాల్లో 13 స్థానాలకు ఎన్నికలు

అయితే, 2020 జాతర కంటే ఈసారి మాత్రం మేడారం హుండీ ఆదాయం తగ్గిపోయింది.. గత జాతరలో రూ.11.64 కోట్ల ఆదాయం రాగా.. బంగారం ఒక కేజీ 63 గ్రాముల 900 మిల్లిలు, వెండి 53 కేజీల 450 గ్రాములుగా వచ్చింది.. ఈసారి హుండీ ద్వారా 816 మంది రూ.3.04 లక్షలు మూడు లక్షల నాలుగు వేలు అమ్మవార్లకు సమర్పించిన భక్తులు.. కానీ, మొత్తంగా గత జాతరతో పోలిస్తే ఈసారి మేడారం జాతర హుండీ ఆదాయం దాదాపు రూ.20 లక్షలు తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

Exit mobile version