Site icon NTV Telugu

Mahesh Kumar Goud: కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వార్నింగ్..

Bomma Mahesh Kumar Goud

Bomma Mahesh Kumar Goud

Mahesh Kumar Goud: కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. మెదక్ జిల్లా సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులపై ఫైర్‌ అయ్యారు. పార్టీ లో క్రమశిక్షణ అనేది చాలా కీలకం అన్నారు. క్రమశిక్షణ ఉల్లంగిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీస్కెళ్లాలని సూచించారు. ప్రజల మద్దతు ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉండేలా కృషి చేయాలన్నారు. క్షేత్ర స్థాయి లో మరింత లోతుగా పని చేయాలన్నారు. రాబోయే ఎన్నిలకలో మనం మరింత గట్టిగా పని చేయాలని సూచించారు. నియోజక వర్గ ఇన్‌చార్జ్ భేషజాలకు పోకుండా కలిసికట్టుగా పని చేసి మంచి ఫలితాలు తేవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. పార్టీ లో క్రమశిక్షణ అనేది చాలా కీలకం అన్నారు. క్రమశిక్షణ ఉల్లంగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Navy Radar Station: దామగుండంలో నెవీ రాడార్‌ స్టేషన్‌.. శంకుస్థాపన చేసిన రాజ్‌ నాథ్‌ సింగ్‌, రేవంత్ రెడ్డి

Exit mobile version