Site icon NTV Telugu

Edupayala Temple: మూడోసారి మూతపడిన ఏడుపాయల ఆలయం..

Edupayala Temple

Edupayala Temple

Edupayala Temple: ఏడుపాయల వనదుర్గ ఆలయాన్ని మరోసారి మూసివేశారు. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు ఆలయాన్ని మూసివేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో భారీ వరద వచ్చింది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అమ్మవారి దర్శనాలను నిలిపివేశారు. దీంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఈ నెలలో ఏడు పాయల ఆలయాన్ని మూసివేయడం ఇది మూడోసారి. ఈ నెల ప్రారంభంలో మెదక్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. దీంతో సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టు గేట్లను ఎత్తేయడంతో ఆలయం నీటమునిగింది. ఎనిమిది రోజుల పాటు ఆలయాన్ని అధికారులు మూసివేసిన సంగతి తెలిసిందే.
KTR: ఏపీ సీఎం చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసలు..

Exit mobile version