CM Revath Reddy: మెదక్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఏడు పాయల అమ్మవారికి పట్టవస్త్రాలు సమర్పించారు. ఇవాళ ఉదయం హెలికాప్టర్ లో సీఎం మెదక్ చేరుకున్నారు. మెదక్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం నేరుగా ఏడు పాయల ఆలయానికి చేరుకున్నారు. సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఏడు పాయల అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. సీఎం రేవంత్ కి ఏడు పాయల ఆలయ అర్చకులు జ్ఞాపికను అందించారు. సీఎం రేవంత్ వెంట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి, దామోదర రాజనర్సింహ ఉన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు..
* మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే కార్యక్రమాలు..
* 750 కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన
* 250 కోట్ల రూపాయలతో నార్సింగ్ కాలేజీ, 210 కోట్లతో పారా మెడికల్ కాలేజీ పనులకు శంకుస్థాపన
* మెదక్ చర్చి అభివృద్ధి పనుల కోసం 30 కోట్ల రూపాయలు మంజూరు
* ఏడు పాయల ఆలయానికి 35 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం
* యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి సీఎం శంకుస్థాపన
* తండాల్లో 45 కోట్ల రూపాయలతో రోడ్డు పనులకు సీఎం శంకుస్థాపన
* మహిళా స్వయం సహాయక గ్రూపులకు 100 కోట్ల రూపాయల చెక్కుని అందించనున్న సీఎం
Telangana Rains: తెలంగాణపై అల్పపీడన ప్రభావం.. రెండు రోజులు వానలు