NTV Telugu Site icon

Medak Crime: దారుణం.. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి..

Medak Crime

Medak Crime

Medak Crime: డిగ్రీ విద్యార్థినిపై పట్టపగలు ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేసిన దారుణ ఘటన మెదక్ పట్టణంలో సంచలనంగా మారింది. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు యువతి వచ్చింది. అక్కడే వున్న చేతన్ అనే యువకుడు ఆమెపై ఒక్కసారిగా దాడి చేశాడు. యువతిని కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రేమించడం లేదని యువతిపై చేతన్ అనే యువకుడు కత్తితో దాడి చేసినట్లు తెలిసింది. కత్తితో దాడి చేస్తున్న చేతన్ ను యువతి అడ్డుకోబోయింది అయినా చేతన్ ఆమెపై విరుచుకుపడ్డాడు. దీంతో యువతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఆమెను కాపాడారు. ఈ ప్రమాదంలో యువతి చేతికి తీవ్ర గాయమైంది. ఇది గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు చేతన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి నిందితుడు వాడిన కత్తి, యువతి సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్షులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఘటన స్థలం వద్ద సీసీ కెమెరాల లేకపోవడంతో చుట్టుపక్కల సీసీ కెమెరాల పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Hyderabad Metro: మెట్రోలో సాంకేతిక లోపం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన మెట్రో రైళ్లు..

Show comments