Site icon NTV Telugu

Suicide : మెదక్ టీచర్ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియోలో మిత్రద్రోహంపై ఆవేదన

Suicide

Suicide

Suicide : మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న విషాదకర ఘటన స్థానికులను కలచివేసింది. మేడ్చల్‌లోని ఓ లాడ్జ్‌లో మెదక్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరేసుకునే ముందు తాను ఎదుర్కొంటున్న మానసిక వేదనను వీడియో రూపంలో రికార్డు చేసి తన ఆఖరి మాటలు చెప్పాడు.

హావేలిఘనపూర్ మండలంలోని సర్దన జిల్లా పరిషత్ హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న రమేష్ (45) గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి భారీ నష్టాలను ఎదుర్కొన్నాడు. అప్పుల భారంతో ఇల్లు, బంగారం, కొంత ఆస్తి విక్రయించి కొంతమేర అప్పులు తీర్చినట్లు తన వీడియోలో తెలిపాడు. అయితే డబ్బులు తీసుకున్న కొందరు మిత్రులే మిత్రద్రోహం చేస్తున్నారని, తనపై ఒత్తిడి పెడుతున్నారని వాపోయాడు.

Mahindra Thar: బెంజ్‌ కార్‌ను రక్షించిన మహీంద్రా థార్.. ఒకసారి ఈ వైరల్ వీడియో చూడండి..

“నేను చనిపోయిన తర్వాత నా కుటుంబం రోడ్డున పడకుండా చూడండి” అని రమేష్ తన చివరి వీడియోలో మనసు విప్పాడు. అనంతరం మేడ్చల్‌లోని లాడ్జ్‌లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనతో రమేష్ కుటుంబం, సహచర ఉపాధ్యాయులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రమేష్ ఆత్మహత్యకు గల కారణాలపై లోతుగా విచారణ చేస్తున్నారు.

Viral News: ప్రియుడితో గదిలో ఎంజాయ్ చేస్తున్న భార్య.. పిల్లలతో అక్కడికి వచ్చిన భర్త.. (వీడియో)

Exit mobile version