Edupayala Temple: వనదుర్గా ఆలయం వద్ద స్వల్పంగా తగ్గిన వరద నీరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Edupayala Temple: మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఏడు పాయల ఆలయం వద్ద వరద నీరు స్వల్పంగా తగ్గింది. 10 రోజులుగా వన దుర్గా భవాని ఆలయం జలదిగ్బంధంలోనే వుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 64 రోజులు ఆలయం మూతపడింది. ఆలయం ముందు ప్రవహిస్తున్న మంజీరా నది.. అమ్మవారి నిజ రూప దర్శనానికి వచ్చే భక్తులకు నిరాశ ఎదురైంది. భారీవర్షాల ప్రభావం, మంజీరా నది విశ్వరూపంతో పాపన్నపేటలోని ఏడు పాయల ఆలయం ముందు పదిరోజులుగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జలదిగ్బంధంలోనే వన దుర్గా భవానీ ఆలయం వుండిపోయింది. అమ్మవారి గర్భగుడిలో.. అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా నది ప్రవహిస్తోంది. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి.
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
గతంలో వర్షాకాలంలో అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలోనే వుండడం సర్వసాధారణం. కానీ ఈ ఏడాది అక్టోబర్ నెలలోనూ అమ్మవారిని వరద వీడడం లేదు. దీంతో అమ్మవారి దర్శనానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు నిరాశ తప్పడంలేదు. రోజూ వేలాదిమంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. వరద ప్రవాహం ఎక్కువగా వుండడంతో భక్తుల రావద్దని అధికారులు సూచించారు. పచ్చని అడవి, డెన్ లోపల సహజ రాతి నిర్మాణాల మధ్య ఉన్న సుందరమైన మందిరం ఇది. ఈ ఆలయాన్ని సందర్శిస్తే తమ కోరికలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తారు. వర్షాకాలంలో వరద ఆలయంలోపలికి ప్రవశిస్తుంది. దుర్గభావానీ పాదానికి చేరుకుంటుంది. ఈ అద్భుతమైన సంఘటనను చూడటానికి వేలాది మంది భక్తులు ఏడుపాయలకు వస్తుంటారు. కానీ ఈసారి ఆలయం ఎక్కువగా వరద నీటిలోనే ఉండిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో వరద నీటి సవ్వడి తప్ప భక్తుల సందడి కనిపించడం లేదు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!