NTV Telugu Site icon

ప్రధాని మోదీకి ఉత్తరాలు రాసిన మెదక్ జిల్లా చిన్నారులు.. ఎందుకంటే?

ప్రధాని నరేంద్ర మోదీకి మెదక్ జిల్లాకు చెందిన 200 మంది చిన్నారులు మూకుమ్మడిగా ఉత్తరాలు రాశారు. వివరాల్లోకి వెళ్తే… తాము చదవుకునేందుకు త‌మ‌ జిల్లాలో నవోదయ పాఠశాల, సైనిక్ పాఠశాల ఏర్పాటు చేయాలని చిన్నారులు ప్రధాని మోదీని కోరారు. త‌మ‌ జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేస్తే బాగుంటుంద‌ని ఉత్తరాలలో పేర్కొన్నారు. నవోదయ పాఠశాలలు ఉంటే త‌మ జీవితాలు బాగుప‌డుతాయ‌ని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే.. కేవలం 10 జిల్లాలలో మాత్రమే నవోదయ పాఠశాలలు ఉన్నాయని చిన్నారులు మోదీకి రాసిన లేఖలలో పేర్కొన్నారు. సుమారు 200 మంది విద్యార్థులంతా క‌లిసి పోస్టు కార్డుల ద్వారా ప్రధానికి ఈ విజ్ఞప్తి చేశారు. కాగా న‌వోద‌య పాఠ‌శాల‌లు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాల‌ని చాలా కాలంగా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.