NTV Telugu Site icon

Sajjanar: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో.. ట్వీట్ చేసిన ఎండీ సజ్జనార్

Sajjanar

Sajjanar

Sajjanar: సోషల్ మీడియాలో వైరల్‌ కావడడానికి చాలామంది రకరకాల వీడియోలు చేస్తుంటారు. లైక్‌ ల కోసం నానా తిప్పలు పడుతుంటారు. కొందరు ఒక బైక్‌ పై కూర్చుని చేసిన వెకిలి చేష్టలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. సాధారణంగా బైక్‌పై ఒకరు లేదా ఇద్దరు ప్రయాణిస్తారు. అయితే ఇద్దరు పిల్లలతో కలిసి నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న సందర్భాలు ఉన్నాయి. వారు ఇంతకంటే ఎక్కువ చేస్తారు, కానీ మీరు ఎప్పుడైనా ఏడుగురు కలిసి ప్రయాణించడం చూశారా? ఇది ఎలా సాధ్యమవుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అటువంటి జాతి రత్నాలు అప్పుడప్పుడు కనిపిస్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఏడుగురు యువకులు ఒకే బైక్‌పై తిరుగుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read also: Thursday Remedies: గురువారం నాడు ఈ నివారణలు చేస్తే.. ఊహించని డబ్బు మీ సొంతం!

ఓ బాలుడు బైక్‌పై వెళ్తుండగా.. మరొకరు ఎదురుగా ఉన్న పెట్రోల్‌ ట్యాంక్‌పై కూర్చున్నారు. బైక్ రైడర్ వెనుక నలుగురు తెలివైన వ్యక్తులు కూర్చున్నారు. వారితో పాటు ఆరుగురు..చివరివాడి భుజాలపై కూర్చొని.. గాలిలో ప్రయాణిస్తున్నట్లుగా అనిపిస్తుంది. సరే.. ఇంత మంది ఒకే బైక్‌పై వెళ్తున్నారు.. కనీసం మెల్లగా వెళ్లకుండా.. స్పీడ్‌గా వెళ్తున్నారు. ఇదంతా ఒకటైతే.. వారంతా 18 ఏళ్ల లోపు వారే కనిపించడం మరో విశేషం. అదే దారిలో ప్రయాణిస్తున్న కారులోని ఓ వ్యక్తి ఈ అరుదైన దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అది వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. ద్విచక్రవాహనాలపై ఇలాంటి ప్రయాణాలు ప్రమాదకరమని సజ్జనార్ రాశారు. ఏ మాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని హెచ్చరించారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర ప్రయాణాలు చేయడం సరికాదని సూచించారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది బైక్‌లపై వెళ్లడం చట్ట విరుద్ధమని సజ్జనార్ సూచించారు. ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ జిల్లాలో జరిగిందీ సంఘటన. ద్విచక్రవాహనాలపై ఇలాంటి ప్రయాణాలు యమ డేంజర్‌. ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర ప్రయాణాలు చేయడం సరికాదు. బైక్‌లపై ఇద్దరు కంటే ఎక్కువమంది ప్రయాణించడం చట్టవిరుద్దమని సజ్జనార్ ట్విట్ చేశారు.

Astrology: ఆగస్టు 10, గురువారం దినఫలాలు