NTV Telugu Site icon

TS Congress: అభ్యర్థులను ప్రకటించనే లేదు.. మహేశ్వరంలో మేయర్ పారిజాత ప్రచారం

Parijatham

Parijatham

TS Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంకా గందరగోళంగానే ఉంది. ఒడిశా ఎన్నికలు సమీపిస్తున్నాయి. కానీ.. హస్తం పార్టీ ఇంకా కిందిస్థాయి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. తమ సీఎం అభ్యర్థి ఎవరని ఎన్నిసార్లు అడిగినా చెప్పని నేతలు.. ఇప్పుడు చిన్న చిన్న లీకులు వదులుతున్నారు. ఇదంతా ఒక ఎతైతే రంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్తిగా ప్రచారం జరుగుతుండటం పార్టీశ్రేణుల్లో ఆశక్తికరంగా మారింది. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించక ముందే ప్రచారం షురూ అయ్యింది. కాంగ్రెస్ మహేశ్వరం తనకే వచ్చిందని మేయర్ పారిజాత ప్రచారం మొదలుపెట్టారు. మహేశ్వరం కాంగ్రెస్ కార్యకర్తలు పారిజాతకు మద్దతు ఇవ్వాలని ఫోన్లు కూడా రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఏఐసీసీ, పీసీసీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకుండానే సొంతంగా తానే అభ్యర్థినని ప్రచార రథం వేసుకొని పారిజాత తిరుగుతున్నారు. పారిజాత తీరు పై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అభ్యర్థులే ప్రకటించకపోయినా ఈ ప్రచార సభలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. పారిజాత తీరుపై సొంత పార్టీ నేతలే గుర్రుమంటున్నారు. ఇది సరైన పద్దతి కాదంటూ సీరియస్ అవుతున్నారు. ఇక మరోవైపు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 15న కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేస్తామని, 75 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీఆర్ ఎస్ కు సేవలందిస్తున్న అధికారులను వదిలిపెట్టేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా.. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పారిజాత నర్సింహారెడ్డి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆమెకు బడంగ్‌పేట కార్పొరేషన్‌ మేయర్‌ పదవి దక్కింది. అయితే మంత్రి సబితతో మేయర్ కు కొద్దిరోజులుగా విభేదాలు వచ్చినట్లు సమాచారం. కార్పొరేషన్ పరిధిలో జరిగే ప్రతి కార్యక్రమం తన పరిజ్ఞానం మేరకే జరగాలని మంత్రి మేయర్ పై కఠిన నిబంధనలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న చిన్న పనులు కూడా మంత్రి చేతుల మీదుగా ప్రారంభమవుతున్నాయి. సబిత తీరుతో మనస్తాపం చెందిన పారిజాత నర్సింహారెడ్డి రాజీనామా చేసి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమకంలో కాంగ్రెస్ లో చేరారు. అయితే ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించక ముందే పారిజాతా ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Dasara Movie: ఎవరి టైమ్ వాళ్లు లాక్ చేసుకున్నారు? ఇక రిలీజ్ అవ్వడమే లేట్