Site icon NTV Telugu

Pulluri Prasad Rao : మావోయిస్టులకు మరో దెబ్బ.. డీజీపీ ముందు లొంగిపోనున్న కీలక నేతలు

Chatishghad Maoist

Chatishghad Maoist

Pulluri Prasad Rao : మావోయిస్టు ఉద్యమానికి మరోసారి తీవ్ర దెబ్బ తగలనుంది. కొద్దిసేపట్లో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముందు ఇద్దరు ప్రముఖ మావోయిస్టు నాయకులు లొంగిపోనున్నట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న, మరో కీలక నాయకుడు బండి ప్రకాశ్ అధికారుల ముందుకు రానున్నారు.

SamanthaRuthPrabhu : శారీలో ఫ్యాన్స్ ను గిలిగింతలు పెడుతున్న సమంత.. ఫొటోస్

చంద్రన్న మావోయిస్టు పార్టీకి ఐడియాలజీని నిర్మించిన ప్రధాన వ్యూహకర్తగా, అనేక దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమానికి కీలకమైన మార్గదర్శకుడిగా ఉన్నారు. ఆయన లొంగుబాటు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. తెలంగాణ పోలీసుల నిరంతర చ‌ర్య‌లు, అభివృద్ధి కార్యక్రమాల ప్రభావంతో మావోయిస్టు ప్రభావం రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోగా, ఇప్పుడు ప్రముఖ నేతల లొంగుబాటు ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేయనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Viral Video: పుట్టకు పూజలు, నాగయ్య ప్రత్యక్షం.. కార్తీక సోమవారం నాడు అద్భుత దృశ్యం!

Exit mobile version