NTV Telugu Site icon

మరోలేఖ విడుదల చేసిన మావోయిస్టులు..

Maoist

Maoist

కరోనా మహమ్మారి అడవుల్లో అన్నలను కూడా తాకింది.. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు కరోనా బారినపడ్డారు.. వారు జనజీవన స్రవంతిలో కలిసిపోతే వారికి సరైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు ప్రకటనలు చేస్తున్నారు.. అయితే, పోలీసుల ప్రకటను తీవ్రంగా ఖండిస్తున్నారు మావోయిస్టులు.. ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్‌ పేరుతో ఓ లేఖ విడుదల చేశారు.. కామ్రేడ్ శారద, ఇడ్మా ఆరోగ్యంగానే ఉన్నారని. పాలకులు, ప్రభుత్వాలు కావాలనే దుష్పాచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.. వాటిని నమ్మి కుటుంబ సభ్యులు, ప్రజలు గందరగోళ పడాల్సిన అవసరం లేదని.. ఇలాంటి విషయాలను పార్టీ అధికారికంగా నిజాలను తెలియ జేస్తుందని.. అప్పుడు మాత్రమే నమ్మాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు జగన్.. మావోయిస్టులు కరోనా బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దళ సభ్యులను బయటికి వెళ్ళకుండా బలవంతంగా అడ్డుకుంటున్నారని, బయటికి వస్తే మెరగైన వైద్యం అందిస్తామని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వాస్తవానికి గంగాల్ ను , కాసోబ్రాయ్ లను తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రికి పంపిస్తే పక్క సమాచారంతో అరెస్టులు చేసి వారికి వైద్యం అందకుండ చేసి నీచంగా హత్య చేసిన కుటిల నీతి కలిగిన కసాయి ప్రభుత్వాలు, పోలీసులు మళ్ళీ ప్రజలను నమ్మించడానికి, శ్రేయోభిలాషి లాగా హితవులు పలుకుతున్నారంటూ ఫైర్ అయ్యారు.

ప్రజల కోసం పోరాడుతున్న వారికి వైద్య అవకాశాలు కల్పించకుండా కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీని నిర్మూలించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకొని నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు జగన్… ఈ కారణంగానే హరిభూషణ్ , భారతక్కలకు సరైనా వైద్యం అందించలేకపోయామన్న ఆయన.. వాస్తవానికి ఈ కామ్రేడ్స్ చనిపోయే ఒక రోజు ముందు ఇన్ఫార్ల ద్వారా సమాచారంతో గ్రేహౌండ్స్, ఛత్తీస్‌గఢ్‌ సంయుక్తంగా వందలాది మంది పోలీసులు దాడి చేయడానికి ఆపరేషన్ చేపట్టారని ఆరోపించారు.. మా ప్రజల ద్వారా పోలీసుల సమాచారం తెలుసుకొని మా కామ్రేడ్స్ ను కాపాడుకోవాడానికి వారిని మోసుకు తిరిగామని.. ఈ నిర్భంధం మధ్యనే బ్రతికించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాం.. కానీ, బ్రతికించుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, శారద , హిడ్మి చని పోయారని ప్రజల్లో ప్రచారం చేసి ఒక పెద్ద గందరగోళాన్ని, భయాన్ని ప్రజల్లో స్పష్టంచడానికి పోలీసులు కుట్ర పూరితంగా ప్రచారం చేస్తున్నారని విమర్శించిన జగన్.. మేం కరోనాకు అతితులమేమీ కాదు.. ప్రజల మధ్యనే జీవిస్తున్నాం అని లేఖలో పేర్కొన్నారు జగన్.