NTV Telugu Site icon

Maoist celebrations: మావోయిస్టు వారోత్సవాలు.. అప్రమత్తమైన పోలీసులు.

Bhupalapalli Bhadradri

Bhupalapalli Bhadradri

Maoist celebrations in Bhupalapalli-Bhadradri:మావోయిస్టు వారోత్సవాల నేపద్యంలో తెలంగాణ రాష్ట్రం అలర్ట్‌ అయ్యింది. జిల్లాల వారీగా టార్టెట్‌ చేస్తూ తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. నేటి నుండి ఈ నెల 8వరకు జరగనున్న మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలపై పోలీసులు హై అలెర్ట్‌ అయ్యారు. జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలల్లో.. పోలీసులు ప్రత్యేక బలగాలతో అటవీ,గ్రామీణ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. సరిహద్దు గోదావరి తీర ప్రాంతాల్లో, లోతట్టు గ్రామాలు, అంతరాష్ట్ర వంతెనల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీ చేపట్టి అనుమానితులను విచారిస్తున్నారు పోలీసులు. ప్రధాన రహదారులు.అడవులను జల్లెడ పడుతున్న పోలీస్ బలగాలు. ఏజెన్సీ గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటున్నారు. ఏజన్సీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఊచించారు. ఎవరిమీద అయినా అనుమానం వస్తే తెలియచేయాలని తెలిపారు.

Read also: JNU: జేఎన్‌యూలో మరో వివాదం.. క్యాంపాస్‌లో బ్రహ్మణ వ్యతిరేక నినాదాలు

మావోయిస్టు పి.ఎల్.జి. వారోత్సవాలు సందర్భంగా.. ములుగు జిల్లా వెంకటాపురం వాజెడు మండలాల్లో రెడ్ అలెర్ట్ అయ్యారు. అడుగు అడుగున వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు. కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు అడవులనిజల్లెడ పడుతున్నారు. మావోయిస్టు హిట్ లిస్టులో ఉన్న నాయకులకి మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లాలని నోటీసులు జారీ చేసిన పోలీసులు.. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని అయోమయంలో ఏజన్సీ ప్రాంతాల్లో అలర్ట్‌గా ఉన్నారు అధికారులు.
Tesla: టెస్లా నుంచి హెమీ డ్యూటీ ఎలక్ట్రిక్ ట్రక్కు.. ఆవిష్కరించిన ఎలాన్ మస్క్