Singareni BTPS : వర్షాలు రావడం లేదని అక్కడి వారు భావిస్తుంటే ఒక్క సారిగా రాత్రి కురిసిన వర్షానికి ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం అక్కడ కురిసిన బారీ వర్షంలో బూడిద రాలడమే.. అరా కొరాగా కాదు సుమండి.. భారీగా బూడిద వర్షంతో వచ్చి పడింది. బూడిద వర్షంతో అక్కడి ప్రజలు ఆందోళనలకు గురయ్యారు. ప్రధానంగా బారీ వర్షంలో కూడ బకెట్లు బకెట్లు నిండేంత స్థాయిలో బూడిద కురవడం ఆందోళనల చెందిన పరిస్థితి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూర్ మండలంలో గత రాత్రి కురిసిన వర్షానికి బూడిద వర్షం కురిసింది. అసలు బూడిద వర్షం ఏమిటి అన్న అనుమానాలు రావచ్చు.. కాని ఇది నిజం… ఇక్కడ ఇలా బూడిద వర్షానికి కారణం బిటిపిఎస్ అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పటి నుంచో ఇక్కడ సింగరేణి మైన్స్, ఓపెన్ కాస్టు గనులు ఉన్నప్పటికి ఏనాడు కూడ ఇటువంటి పరిస్తితి కనిపించలేదు. ఎప్పుడు రోడ్ల మీద సింగరేణి బొగ్గు వంటి పదార్ధాలు కనిపిస్తుంటాయి. కాని వర్షంలో బూడిద తో కూడి రావడం మాత్రం ఎప్పుడురాలేదు. అందువల్లనే ఇక్కడ ఈ బూడిద వర్షం పట్ల ఇక్కడ ప్రజలు ఆందోళనల చెందుతున్నారు. మణుగూర్ ఏరియాలో ఇప్పటికే సింగరేణి ఓపన్ కాస్టు గనులు ఉన్నాయి. అదే విదంగా అశ్వాపురం వద్ద బార జల కార్మాగారం ఉంది. పక్కనే జీవ నది గోదావరి ప్రవహిస్తుంది. అటవీ ప్రాంతం కూడ బాగా ఉంటుంది. ఇన్ని ఉన్నప్పటికి ఇక్కడ వాతవరణం మాత్రం పొల్యూషన్ గా మారిపోయింది.
బూడిద పొడి వర్షం కురవడం చాలా అరుదు. ఇలాంటి సంఘటనలు అడవి మంటలు, అగ్నిపర్వతాలు ప్రాంతాల్లో ఎక్కువగా చోటుచేసుకుంటాయి. కానీ అలాంటిది ఏమి లేకపోయినా తాజాగా పారిశ్రామిక ప్రాంతమైన మణుగూరులో సంభవించడం ఇక్కడ ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. భద్రాది కొత్తగూడెం జిల్లా సింగరేణి, భద్రాది ధర్మల్ విద్యుత్ కేంద్రం నెలకొన్నప్పటికీ వాటి యొక్క ప్రభావమే మణుగూరు లో శివలింగాపురం, బాపన కుంట, రాజుపేట విటల్ రామ్ నగర్, గాంధీ బొమ్మ సెంటర్ మరి కొన్ని ప్రాంతాల్లో ఈ బూడిద వర్షానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. సింగరేణి గనుల వల్లనే ఇప్పటికే పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఇక్కడ బిటిపిస్ దర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడ ఏర్పాటు చేశారు. ఈధర్మల్ విద్యుత్ కేంద్రానికి పెద్ద ఎత్తున లారీల్లో బొగ్గు తరలి వెళుతుంది. ఆ లారీల నుంచి పడే బొగ్గు దుమ్మ కూడ గాలిలో కలిసి పోతుంది. మణుగూరు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఈ దుమ్ముతో వాహన దారుల, ఇళ్లులు నల్లగా మారిపోతుంది. ఎవ్వరైనా బయటకు వచ్చి ఇంటికి వెళ్లే లోపులోనే బూడిద తో నల్లగా బట్టలు మారిపోతాయి. అంతలా ఇక్కడ బూడిద ప్రభావం ఉంటుంది. అయితే తాజాగా గత రాత్రి పందొమ్మిది సెంటీమీటర్ల వర్షంకురిసింది. అంత బారీ స్థాయిలో కురిసిన వర్షంలో బూడిద వర్షం కనిపించకుండా పోవలసి ఉంటుంది. కాని ఇక్కడ బూడిద బూడిద గా వర్షంనీళ్లురావడం ఆలోచించాల్సిన విషమని అంటున్నారు. అటు ములుగు, బూపాలపల్లి జిల్లాల మీదుగా వచ్చిన వర్షం మణుగూర్ లో కూడ పెద్ద స్థాయిలో కురిసింది. గత రాత్రి మణుగూర్ లోని అనేక ప్రాంతాలు వర్షం వల్ల ముంపుకు గురయ్యాయి. వాడల్లోకి నీళ్లు వచ్చి చేరాయి.
ఇదే సందర్బంలో గత రాత్రి కురిసిన వర్షం నుంచి బూడిద కూడ రాలి ప డింది. చాలా మంది ఇళ్ల మీద బూడిద తో కూడిన వర్షం పడింది. ఇది చూసి పట్టణ వాసులు ఆశ్చర్య పోయారు. ముఖ్యంగా నలుపు మేఘాల్లో నుండి నల్లటి బూడిద వర్షం ఈ ప్రాంతంలో కురిసింది. మణుగూర్ పరిసర ప్రాంతాల్లోని శివలింగాపురం, బాపనుకుంటా, గాంధీ బొమ్మ సెంటర్, రాజుపేట , పీకే వన్ సెంటర్ లో కలుషితమైన బూడిద నీరు ప్రవహించింది. ఈ క్రమంలో కొందరు కురిసిన వాన నీటిని పట్టుకుందామని బకెట్లు గిన్నెలు పెట్టడంతో నల్లటి బూడిద రంగు వలె నీరు కనిపించింది. మణుగూరు ఏరియాలో బూడిద పొడి వర్షం కురవడం తో రహదారులు, నివాస గృహాల్లో బూడిద కుప్పలు కుప్పలుగా మేట వేసింది. అంతేకాకుండా మణుగూరు లో ఇలాగే బూడిద పొడి వర్షం కురిస్తే ఈ ప్రాంత ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు నని ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి బూడిద వర్షం ఎప్పుడూ చూడలేదని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
