Duddilla Sridhar Babu: మంథనిలో అభివృద్ధి పనుల జాతర.. రూ.164 కోట్లతో శంకుస్థాపనలు
- మంథని నియోజకవర్గంలో రూ.164 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
- రెండేళ్లలో మంథని అభివృద్ధికి రూ.800 కోట్లు: శ్రీధర్ బాబు
- రూ.20 కోట్లతో NAC సెంటర్ మంజూరు: కోమటిరెడ్డి
- గోదావరి బ్రిడ్జికి నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duddilla Sridhar Babu: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జోరు కొనసాగుతోంది. బుధవారం మంథని నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడిగా పాల్గొని రూ.164 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ ప్రాంతాభివృద్ధికి ప్రభుత్వ కట్టుబాటును పునరుద్ఘాటించారు.
మంథని అభివృద్ధికి రూ.800 కోట్లు: మంత్రి శ్రీధర్ బాబు
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గడిచిన రెండు సంవత్సరాల కాలంలో మంథని నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం దాదాపు రూ.800 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే నేడు రూ.164 కోట్లతో వివిధ సంక్షేమ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకున్నామని తెలిపారు. గోదావరి నదిపై ప్రతిపాదిత బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిందని వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని క్రమంగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు.
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
రూ.20 కోట్లతో న్యాక్ సెంటర్ మంజూరు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో మంథని ప్రాంతానికి ఎనలేని సేవలుందించిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ స్పీకర్ శ్రీపాద రావుల సేవలను స్మరించుకున్నారు. ఈ నియోజకవర్గ పురోగతికి రూ.800 కోట్ల నిధులు కేటాయించడం శుభపరిణామమన్నారు. యువతకు ఉపాధి, సాంకేతిక శిక్షణ అవకాశాలను విస్తరించేందుకు మంథనిలో రూ.20 కోట్ల వ్యయంతో న్యాక్ (NAC) సెంటర్‌ను మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!