NTV Telugu Site icon

Manikrao Thakre: పొత్తులు అనేవి ఉండవు.. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాం

Manikrao Thakre

Manikrao Thakre

Manikrao Thakre Gives Clarity On BRS Congress Alliance: వచ్చే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, అప్పుడు కాంగ్రెస్‌తో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావు థాక్రే స్పందించారు. తన వ్యాఖ్యలను వెంకటరెడ్డి ఉపసంహరించుకున్నారని స్పష్టం చేశారు. ఎవ్వరితోనూ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోదని, అసలు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌కి లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ‌లో ఒంటరిగా అధికారంలోకి వచ్చేంత బలం కాంగ్రెస్‌కి ఉందని పేర్కొన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీజేపీ లాంటి శక్తులు పొత్తుల పేరిట తమను వీక్ చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. తాము ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలందరూ ఐక్యంగా ఉన్నారని, త్వరలోనే నాయకులంతా పాదయాత్రలు చేస్తారని వెల్లడించారు.

Rana Naidu Trailer: నేను నీ బాబును రా.. వెంకీ- రానాల నట విశ్వరూపం

అంతకుముందు.. పీసీసీ ఉపాధ్యక్షులతో సమావేశమైన థాక్రే, వారికి క్లాస్ పీకారు. మొత్తం 84 మంది ఉపాధ్యక్షులు ఉండగానే.. కేవలం 30 మందే సమావేశానికి రావడంపై సీరియస్ అయ్యారు. ఉపాధ్యక్షులకు కేటాయించిన జిల్లాలకు వెళ్లకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేటాయించిన జిల్లాలకు వెళ్లకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఎవరైనా పార్టీ లైన్ దాటితే.. వారిని పార్టీ నుంచి తప్పించడానికి కూడా వెనుకాడబోమని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ సమావేశాలకు ఖచ్చితంగా హాజరుకావాల్సిందేనని నొక్కి చెప్పారు. ఇదే సమయంలో.. తెలంగాణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నేతలకు పలు లక్ష్యాలను నిర్దేశించడంతో పాటు హాత్ సే హాత్ జోడో యాత్రలో ఖచ్చితంగా పాల్గొనాలని ఆదేశించారు.

Kishan Reddy.. విమానాశ్రయాల ఏర్పాటుపై కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ

ఇదిలావుండగా.. తొలుత ఢిల్లీలో మీడియాతో మాట్లాడినప్పుడు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, కాంగ్రెస్ పొత్తు ఉండొచ్చని వ్యాఖ్యానించిన వెంకటరెడ్డి.. అదే రోజు సాయంత్రం యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యల్ని తప్పుగా వక్రీకరించారని ఆరోపించారు. తన వ్యాఖ్యలు ఎవరికి అర్థం కావాలో, వారికి అర్థమై ఉంటుందన్నారు. తన వ్యాఖ్యలపై బీజేపీ రాజకీయం చేయాలని చూస్తోందని, చిన్న చిన్న నాయకులు సైతం తనని తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో హంగ్ వస్తుందని తాను అనలేదని, తాను ఏ కమిటీలోనూ లేనని స్పష్టం చేశారు.

Show comments