NTV Telugu Site icon

Manda Krishna Madiga: జూలై 2,3 సడక్ బంద్.. బీజేపీ కి డెడ్ లైన్ ..

Mandakrishna

Mandakrishna

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న మాట పగటికలలా మిగిలిపోతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం లో ఎస్సీ వర్గీకరణ కోసం చేపట్టిన పాదయాత్రలో భాగంగా మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా మాదిగ జాతి మరో ఉద్యమానికి సిద్ధపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పిన బిజెపి పెద్దలు ఎనిమిది సంవత్సరాలు అయినా అధికారంలో కొచ్చి వర్గీకరణ ఊసేలేదని నిప్పులు చెరిగారు.

కేంద్రం అధికారంలోకి వచ్చిన మోడీ వాళ్లకు ఇష్టమైన చట్టాలను, వర్గీకరణ లు తెచ్చుకొని ఎస్సి వర్గీకరణను విశ్వసించి మాదిగ జాతిని మోసం చేశారని మండిపడ్డారు. జులై 2,3 న హైదరాబాదులో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల లో సడక్ బందుకు పిలుపునిచ్చామని బీజేపీకి డెడ్టైన్ అంటూ హెచ్చరించారు. జులై 3న కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బిజెపి కార్యక్రమాలకు మాదిగల ఆవేదన ఆగ్రహాన్ని నిరసన రూపంలో తెలియజేస్తామ‌న్నారు.

2, 3 తేదీల్లో సిటీలో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రానున్న ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్​ షా ముందు నిరసన తెలుపుతామన్నారు. జులై 2న సిటీకి వచ్చే అన్ని జాతీయ రహదారులపై బైఠాయించి, రోడ్లను దిగ్బంధనం చేస్తామన్నారు. లోకసభ లో షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లు పెట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు, కాంగ్రెస్, టిడిపి కూడా డిమాండ్ చేసిందని గుర్తు చేసారు. వర్గీకరణ విషయంలో బిజెపి దోషిగా నిలబడనుందని ఆగ్ర‌హం వ్య‌క్తం వ్య‌క్తం చేశారు.