Site icon NTV Telugu

The Antora Store: ది ఆంటోరా స్టోర్‌ను ప్రారంభించిన లక్ష్మీ మంచు

The Antora Store

The Antora Store

Manchu Lakshmi Launched The Antora Store In Bangjara Hills: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ప్రముఖ డిజైనర్ గీతాంజలి రూపొందించిన ‘ది ఆంటోరా స్టోర్‌’ను నటి, నిర్మాత లక్ష్మీ మంచు ప్రారంభించారు. ఈ ఆంటోరా స్టోర్‌లో లగ్జరీ డిజైనర్ దుస్తుల బ్రాండ్స్, ఉపకరణాలతో పాటు ప్రత్యేకమైన & వ్యక్తిగతీకరించిన అనుభవాలను విలువ చేసే అధునాతన వినియోగదారులకు లగ్జరీ వస్తువులు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా, భారతీయ సంస్కృతి ప్రాముఖ్యతను చాటిచెప్పేలా.. ప్రత్యేకమైన డిజైన్లతో దుస్తులను అందించడమే డిజైనర్ గీతాంజలి విజన్. ఆ విజన్‌తోనే ఈ స్టోర్‌ని తెరిచారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా గుర్తింపు పొందాలన్న లక్ష్యంతో సంగీత కృషి చేస్తున్నారు.

ది ఆంటోరా స్టోర్‌లో లెహంగాలు, చీరలు, సూట్లు, ఫ్యాబ్రిక్, కుర్తాలు, ఇండో వెస్ట్రన్, ఎథ్నిక్ దుస్తులు లభిస్తాయి. ఈ బ్రాండ్ మిషన్.. ఉత్పత్తి, రూపకల్పనలో బృందం నైపుణ్యాన్ని ఉపయోగించి.. స్థిరమైన దుస్తులను సృష్టించి, వినియోగదారులకు సంతృప్తి పరచడం. క్లయింట్లకు కావాల్సిన పద్ధతిలో దుస్తులను సిద్ధం చేసే విధంగా.. ఉత్పిత్తి బృందం కట్టుబడి ఉంటుంది. అధిక-నాణ్యత ఉత్పత్తులను సరసమైన ధరకే అందించడానికి, స్థానిక కమ్యూనిటీలు, ఫ్యాషన్ పరిశ్రమ అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. కాగా.. స్టోర్ ఓపెనింగ్ కార్యక్రమానికి ప్రముఖ నటీనటులు అక్షర గౌడ, తేజస్వి మడివాడ, డింపుల్ హయాతి, రాశి సింగ్, శివాత్మిక రాజశేఖర్, వితికా షెరు, సీరత్ కపూర్, పరిధి గులాటి, దివ్య బోపన్న, త్రిషాల కామత్ తదితరులు హాజరయ్యారు.

Exit mobile version