Dharani Portal: ధరణి పోర్టల్ లోని భూముల రికార్డుల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్‌కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల వరకు బాధ్యతలు పర్యవేక్షించిన ప్రైవేటు కంపెనీ క్వాంటెలాను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంతోనే ఈ సంస్థ నిర్వహణ గడువు ముగిసినప్పటికీ తాత్కాలిక నిర్వహణ బాధ్యతలను పొడిగిస్తూ వచ్చింది రెవెన్యూ శాఖ. రేవంత్ రెడ్డి సీఎం కాగానే ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, టీజీటీఎస్ ఎండీతో పాటు పలువురు ఐఏఎస్‌లతో కూడిన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ధరణి నిర్వహణను ఎన్‌ఐసీ, టీజీటీఎస్, సీజీసీ సంస్థలకు అప్పగించే విషయమై అధ్యయనం చేసిన ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పోర్టల్ నిర్వహణను తక్కువ వ్యయంతోనే చేపట్టడానికి ఎన్‌ఐసీ ముందుకు రావడంతో చివరికి దాని వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. మూడేళ్లు ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ఎన్ఐసీ చూడనుంది.
Dharani Portal: ధరణి పోర్టల్ నిర్వహణ ఎన్‌ఐసీకి అప్పగించిన తెలంగాణ సర్కార్
- ధరణి పోర్టల్ నిర్వహణ ఎన్‌ఐసీకి అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం..
- మూడేళ్ల పాటు ఆ సంస్థతో ఒప్పందాన్ని చేసుకున్న తెలంగాణ సర్కార్..
- పని తీరు బాగుంటే మరో రెండేళ్లు పొడిగిస్తామని ఒప్పందంలో వెల్లడి..