NTV Telugu Site icon

వరంగల్ జిల్లాలోని ఆ గ్రామంలో కరోనా టెన్షన్: అంత్యక్రియలు పూర్తయ్యాక… 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలంలోని ఏనుగల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి మరణించాడు.  మరణించిన వ్యక్తికీ బుధవారం రోజున అంత్యక్రియలు నిర్వహించారు.  అయితే, అంత్యక్రియలు నిర్వహించిన తరువాత ఆశా వర్కర్ మొబైల్ కు ఓ మెసేజ్ వచ్చింది.  మరణించిన వ్యక్తికీ కరోనా పాజిటివ్ వచ్చినట్టు మెసేజ్ వచ్చింది.  అయితే, అప్పటికే మరణించిన వ్యక్తికీ అంత్యక్రియలు నిర్వహించడం, ఆ కార్యక్రమానికి అనేకమంది హాజరు కావడంతో ఆ గ్రామంలో కరోనా టెన్షన్ మొదలైంది.  ఇప్పటికే ఆ గ్రామంలో 20 మందికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో అధికారులు ఆ గ్రామంపై దృష్టి సారించారు.