NTV Telugu Site icon

చర్చికి వచ్చే మహిళలే టార్గెట్.. 19 మందిని పెళ్లాడిన యువకుడు

నల్గొండ జిల్లాలో నిత్య పెళ్లికొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జిల్లాకు చెందిన విలియమ్స్ అనే వ్యక్తి ఓ చర్చిలో పియానో వాయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే అదునుగా చర్చికి వచ్చే మహిళలను అతడు టార్గెట్ చేశాడు. మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నానంటూ వారి వెంట పడేవాడు. ఆ తర్వాత మహిళలను లోబరుచుకుని పెళ్లి చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు అతడు 19 మందిని పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Read Also: పంజాగుట్ట పాప హత్య కేసులో పురోగతి

విలియమ్స్ మొదటి భార్య తన భర్త తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. విలియమ్స్ బాగోతం, మోసాలను తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేయడానికి వెళ్లగా… నిందితుడు గుండెపోటు వచ్చిందంటూ ఆస్పత్రిలో చేరాడు. దీంతో అతడిపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.