Balanagar Flyover: బాలానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో బాలానగర్ ఫ్లై ఓవర్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి భూక్య అశోక్ గా గుర్తించారు పోలీసులు.
భూక్య అశోక్ కోమటి బస్తీలో నివాసం ఉంటున్నాడు. గతంలో రేష్మాబేగంతో ప్రేమ వివాహమైంది. భూక్య అశోక్ స్థానిక వెల్డింగ్ షాపులో కూలీగా పనిచేస్తున్నాడు. అయితే కొద్దిరోజులుగా సాఫీగా సాగుతున్న వారి అన్యోన్య దాంపత్యంలో మందు తీరిని చీచ్చుపెట్టంది. అయితే మద్యానికి బాగా బానిసైన అశోక్ రోజూ తాగి వచ్చి భార్యను వేధించేవాడు. రోజూ భార్యను కొడుతుండడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. అంతేకాదు గతంలో తాగి ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో కూడా రెండుసార్లు బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు విచారణలో తేలింది. అయితే నిన్న ఉదయం అశోక్ మద్యం సేవించి భార్యను కొట్టాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
మద్యం మత్తులో బాలానగర్ ఫ్లై ఓవర్ పై నుంచి దూకాడు. ఈ ఘటనలో అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అశోక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఈ సీసీటీవీ ఫుటేజీలో అశోక్ మద్యం మత్తులో ఫ్లైఓవర్ పై నుంచి దూకినట్లు స్పష్టంగా కనిపించింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అశోక్ మృతిపై పోలీసులు ఇప్పటికే భార్యను ప్రశ్నించారు. రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి దాడికి పాల్పడేవాడని భార్య చెప్పింది. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
WTC Final: ఇషాన్ కిషన్‌కి నో ఛాన్స్.. అతనికే చోటు