NTV Telugu Site icon

Loan App: లోన్‌ యాప్‌ వేధింపులు.. మరో యువకుడు బలి

తెలంగాణలో ఆన్‌లైన్‌ యాప్‌ నిర్వాహకుల అరాచకాలు రోజుకు ఒకటి తరహాలో బయటపడుతూనే ఉన్నాయి.. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మరో యువకుడు బలి అయ్యాడు.. ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ నిర్వహకుల వేధింపులు తట్టుకోలేకు జియాగూడకు చెందిన రాజ్‌కుమార్‌ అనే యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజ్‌కుమార్‌ ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ నుంచి రూ. 12 వేలు లోన్‌గా తీసుకున్నారు.. ఇప్పటికే ఈఎంఐ ద్వారా రూ.4 వేలు చెల్లించాడు.. అయితే, లోన్ తీసుకునే సమయంలో స్నేహితుల ఫోన్ నంబర్లను రిఫరెన్స్ కాంటాక్ట్స్ గా పెట్టడమే ఆ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది.. తీసుకున్న మొత్తం చెల్లించకపోవడంతో రాజ్ కుమార్ స్నేహితులకు లోన్ యాప్ నిర్వహకుల మేసేజ్‌లు పెట్టారు.. దీంతో మానసికంగా కృంగిపోయిన రాజ్‌కుమార్‌.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. కాగా, ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపుల కారణంగా.. ఇప్పటికే పలువురు ప్రాణాలు తీసుకున్న విషయం తెలిసిందే.

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఈ నెలలోనే నాల్గోసారి..!