Dead Body On Bike:ప్రజలకు అన్ని ఆరోగ్య సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆచరణలో కనిపించట్లేదు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఒక హృదయ విదారక ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన కుమార్తె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నుండి తన బైక్‌పై తీసుకెళ్లవలసి వచ్చింది. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కోట మేడేపల్లి గ్రామంలో వెట్టి మల్లయ్య అనే వ్యక్తి తన కుమార్తె వెట్టి సుక్కి కి 3 సంవత్సరాలు. ఆరోగ్యం క్షీణించడంతో ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే.. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించింది దీంతో బాలిక మృతి చెందింది. కుమార్తె మృతదేహాన్ని తండ్రి ఖమ్మం నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామమైన కొత్తమేడపల్లికి తరలించడానికి అంబులెన్స్ అందించాలని ఆసుపత్రి అధికారులను ఆశ్రయించాడు.
Read also: YSR Statue : మంగళగిరిలో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించిన అధికారులు
కానీ,ఉచితంగా అంబులెన్స్ సేవలు అందించడం లేదని ఆసుపత్రి అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో.. ఆవ్యక్తి కొంత మంది డ్రైవర్లను సంప్రదించగా మృతదేహాన్ని తరలించేందుకు భారీ మొత్తం డిమాండ్ చేశారు. దారిలో నిలబడి లిప్ట్ అడగగా ఓయువకుడు వారికి లిప్ట్ ఇచ్చాడు. ఆబైక్ లో తల్లి, తండ్రి మధ్యలో కుమార్త మృతదేహంతో బయలు దేరారు. ఇప్పుడు ఆఫోటో వైరల్ గా మారింది. కన్నీరు కారుస్తూ ఆతల్లిదండ్రులు రోదిస్తున్న పోటో ప్రతి ఒక్కరికి కన్నీరుతెప్పిస్తోంది. కాగా.. నిరుపేద గిరిజన కుటుంబం పట్ల అధికారుల నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Etela Rajender: మునుగోడులో వారి బిక్షతో గెలిచారు.. టీఆర్ఎస్ ఆరిపోయే దీపం..