బట్టతలను కవర్ చేసి విగ్గూ పెట్టుకొన్ని మోసాలకు పాల్పడుతున్న కార్తీక్ వర్మ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తానొక ఎన్‌ఆర్‌ఐ అంటూ…మహిళలను ట్రాప్ చేసేవాడు కార్తీక్. తన వివాహం కాలేదని చెప్పి విగ్గుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేవాడు కార్తీక్ వర్మ. అయితే.. ఆ అందమైన కార్తీక్ వర్మ ఫోటోలు చూసి వలలో పడుతున్నారు అమ్మాయిలు. ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిలను మోసం చేసిన కార్తీక్ వర్మ .. అమ్మాయిలతో పరిచయం పెంచుకొని కొన్నాళ్లపాటు సహజీవనం చేశాడు.
వ్యక్తిగత సమయంలో తీసిన ఫోటోలను చూపి… బ్లాక్ మెయిల్ పాల్పడుతున్నాడు కార్తీక్ వర్మ. ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణలో ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిలను మోసం చేశాడు. అయితే… తాజాగా కూకట్ పల్లి లోని ఓ అమ్మాయిని మోసం చేసి డబ్బులు లాగేసుకున్న కార్తీక్ వర్మ. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… కార్తీక్ వర్మ ను అరెస్ట్ చేశారు.
