NTV Telugu Site icon

Malreddy Ranga Reddy: మంచిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు.. దావూద్‌ను దాటేశాడు..!

Malreddy Ranga Reddy

Malreddy Ranga Reddy

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్‌ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి… ఎమ్మెల్యే మంచిరెడ్డిని ఈడీ విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే.. తొలి రోజు 8 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. రెండో రోజు కూడా ప్రశ్నిస్తున్నారు.. అయితే, ఈ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు గుప్పించారు మల్‌రెడ్డి… ఈడీ దర్యాప్తు చేస్తున్న ఇంటర్నేషనల్ డాన్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దావూద్ ఇబ్రహీంని దాటి పోయారని వ్యాఖ్యానించారు.. ఇబ్రహీంపట్నంలో ఇందిరాగాంధీ పంచిన అసైన్డ్ భూముల మీద ఎమ్మెల్యే పడ్డారని విమర్శించిన ఆయన.. రైతుల దగ్గర నయీమ్ తో బెదిరించి భూములు గుంజుకున్నారని మండిపడ్డారు. 2015 నుండి హవాలా కేసులు ఉన్నాయని ఈడీ అంది.. కిషన్ రెడ్డి చేసిన మనీ లాండరింగ్ కి హవాలా డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.. ఈయనకు ఏ వ్యాపారం చేస్తే ఇంత డబ్బు వచ్చింది.. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఉన్న ఆస్తులు ఎన్ని..? ఇప్పుడేంత..? అని ప్రశ్నించారు.

Read Also: CM Jagan : ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎంతో ఉపయోగం

ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న ప్రభుత్వ భూములను బినామీగా ఆయన అనుచరుల దగ్గర పెట్టారని మంచిరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు మల్‌రెడ్డి.. ఇబ్రహీంపట్నంలో బెదిరించి పొలాలను అమ్ముకుంటున్నాడు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మీ ఎమ్మెల్యే చేసిన తప్పులకు మీకు సంబంధం లేకపోతే.. ఎమ్మెల్యేను పార్టీ నుండి, పదవి నుండి వెంటనే బహిష్కరించాలి.. 24 గంటల్లో పార్టీ నుండి బహిష్కరించపోతే ముఖ్యమంత్రి కూడా బాధ్యుడే అవుతారని విమర్శించారు.. ఫార్మా సీట్ లో 8632 ఎకరాల అసైన్డ్ భూమి లో 200 ఎకరాలు కొట్టేశారని విమర్శించిన ఆయన.. ఆరు నెలల క్రితం మాదాపూర్ లో మంచి రెడ్డి పట్టుపడితే వదిలేశారని.. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలెక్టర్ ని కొని ఎమ్మెల్యే గా డిక్లేర్ చేసుకున్నాడని.. ఇప్పుడు దొంగ పట్టుబడ్డాడంటూ ఫైర్‌ అయ్యారు.. ఈడీ ఒక్కటే సరిపోదు.. సీబీఐ, ఆదాయపన్నుశాఖతో కూడా విచారణ చేయాలని సూచించారు మల్‌రెడ్డి రంగారెడ్డి.

Show comments