గత ఎన్నికల్లో సత్తుమల్లి ఎమ్మెల్యేగా మట్టా రగమయి దయానంద్ గెలవడం చాలా సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ అధినేత మల్లు నందిని అన్నారు. ఆదివారం సత్తుపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సత్తుపల్లిలో ఎంత డబ్బులు వెదజల్లిన చివరికి ఆడబిడ్డకే సత్తుపల్లి ప్రజలకు పట్ట కట్టారన్నారు.
సత్తుపల్లి లో కాంగ్రెస్ జెండా ఎగరవెయటానికి మట్టా రాగమయి దంపతులు చాలా తపన పడ్డారని అన్నారు. న్యాయం-అన్యాయంకు మధ్య మొన్న జరిగిన ఎన్నికల్లో.. న్యాయం గెలిచిందన్నారు. పది సంవత్సరాలు ఆరాచకాలు తట్టుకుని తట్టుకొని నిలబడిన కాంగ్రెస్ కార్యకర్తలకు సల్యూట్ కొడుతున్నానని పేర్కొన్నారు. రాజన్న రాజ్యం వచ్చింది… ఇంకా అన్ని మంచి రోజులేనని, ఆరు గ్యారంటీ కార్డులల్లో రెండు అమలు చేశారు.. ఇక వంద రోజులోపు మిగతవి ఆమలు చేస్తారని తెలిపారు. భట్టి విక్రమార్క పాదయాత్రలోని సమస్యలే.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఆమలు చేయ్యాటానికి పునాది పడిందని ఆమె పేర్కొన్నారు.