Malla Reddy : మైసమ్మగూడలోని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ సంయుక్త భాగస్వామ్యంతో “డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్” కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో మొట్టమొదటిసారిగా గూగుల్‌తో ఇంత భారీ స్థాయిలో డిజిటల్ భాగస్వామ్యం కుదుర్చుకోవడం విశేషం. భారతదేశంలోనే అతి పెద్ద డిజిటల్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ గా ఇది నిలిచింది. ఈ భాగస్వామ్యంతో సుమారు 50,000 మంది విద్యార్థులు రాబోయే రోజుల్లో సాంకేతిక నైపుణ్యాలు, AI ఆధారిత విద్యా పద్ధతులు, ప్రపంచ స్థాయి సర్టిఫికేషన్లు పొందే అవకాశం ఉంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, విద్యార్థుల ఉత్సాహానికి స్పందిస్తూ డీజే టిల్లు పాటకు స్టెప్పులు వేయడం కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచింది. ఆయన మాట్లాడుతూ, “విద్యార్థులు గూగుల్ వంటి సంస్థలతో కలసి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి” అని సూచించారు. ఈ డిజిటల్ క్యాంపస్ హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూషన్స్ క్యాంపస్ లో ఏర్పాటు చేయబడింది.
Rohit Sharma Perth Century: తొమ్మిదేళ్ల క్రితం పెర్త్‌లో హిట్‌మ్యాన్ విజయగర్జన..
