Site icon NTV Telugu

Gun Firing In Nagole: పక్కా రెక్కీ చేసి అట్టాక్ కు ప్లాన్.. టార్గెట్ వారిద్దరే!

Gun Firing In Nagole

Gun Firing In Nagole

Gun Firing In Nagole: నాగోల్ లో నిన్న జరిగిన బంగారు షాప్‌ లో దోపిడి హైదరాబాద్‌ ను షేక్‌ చేస్తుంది. బంగారు షాప్‌ చొరబడి కాల్పులు జరిపి బంగారం, నగదు ఎత్తుకెళ్లిన తీరు అచ్చం సినిమాను తలపించేలా చేసింది. ఈ ఘటనలో బంగారు షాక్‌ యజమానితో పాటు అక్కడున్న వారిపై కాల్పులు జరడంతో.. తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బంగారు యజమానితో పాటు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే.. మహదేవ్ జ్యువల్లర్స్ కాల్పుల కేసులో గాయపడ్డ వారిని ఆసుపత్రిలో రాచకొండ సీ పీ మహేష్ భగవత్ పరామర్శించారు. 15 టీమ్స్ తో నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. రాచకొండ పరిధిలో గతం లోనూ ఇలాంటి దోపిడీ జరిగిందని గుర్తుచేసుకున్నారు. యూపీ , బీహార్ కు చెందిన ముఠాగా అనుమానిస్తున్నామని అన్నారు. సికింద్రాబాద్‌ గణపతి జ్యువలరీ నుండి ప్రతి గురువారం బంగారాన్ని తెచ్చి అన్ని షాప్ లకు సరఫరా చేస్తారని అన్నారు.

Read also: Bigg Boss 6: సింగర్ రేవంత్ ఇంట్లో సంబరాలు.. ఆడపిల్లకు జన్మనిచ్చిన అన్విత

ఇది లాస్ట్ షాప్ అని, అక్కడ ఫైర్ చేసి దోపిడీ చేశారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. సుఖ్ దేవ్ తో పాటు రాజ్ కుమార్ సుహానను దుండగులు టార్గెట్ చేశారని అనుమానిస్తున్నారు. కాల్పుల సమయంలో సుఖ్ రామ్, రాజ్ కుమార్ లు గోల్డ్ సప్లై చేశారు. పక్కా రెక్కీ చేసి అట్టాక్ కు ప్లాన్ వేశారు. గోల్డ్ సప్లేయర్లను ముందే దుండగులు గుర్తించారు. నిన్న సికింద్రాబాద్ నుంచి రెండున్నర కేజీల గోల్డ్ తో సుఖ్ దేవ్, రాజ్ కుమార్ సుహాన బయటకి వచ్చారు. నాచారం మెడిపల్లి, వనస్థలిపురంలో సుఖ్ రాం,రాజ్ కుమార్ లు కొంత గోల్డ్ సప్లై చేశారు. మూడు ఏరియాల్లో అర కిలో గోల్డ్ సప్లై చేసిన ఇద్దరు లాస్ట్‌కు నాగోల్ లోని మహాదేవ్ షాప్ లో సప్లై చేస్తుండగా ఘటన చోటుచేసుకుంది. 2కిలోల గోల్డ్ లక్ష డెబ్భై నగదు తో దుండగులు ఎస్కేప్ అయ్యారు. ఎవరికి దొరక్కుండా ముందుగానే వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా చూసుకున్నారు. మెహానికి ముసుగు, హెల్మెట్ ధరించి దోపిడీకి పాల్పడ్డారు. నలువురు నిందితుల కోసం 15 టీం లు రంగంలోకి దింపిన రాచకొండ పోలీసులు.

Exit mobile version