Accident : మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అతి వేగంతో దూసుకొచ్చిన ఇన్నోవా కారు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని బలిగొంది. శంషాబాద్ నుంచి సంతోష్ నగర్ వైపు వెళ్తున్న ఓ ఇన్నోవా కారు, మైలార్‌దేవ్‌పల్లి వద్ద నియంత్రణ కోల్పోయి బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్ కారణంగా కారు అదుపుతప్పి నేరుగా ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. రోడ్డు పక్కన దుప్పట్లు, రగ్గులు విక్రయించుకుంటూ అక్కడే నిద్రిస్తున్న ఓ దుకాణంలోకి కారు దూసుకొని పోయింది.
Defection MLA : నేడు ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు
ఈ ప్రమాద సమయంలో దుకాణం వద్ద నిద్రిస్తున్న తండ్రి, ఇద్దరు కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో కుమారుడు దీపక్ అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి ప్రభు మహరాజ్ మరియు మరో కుమారుడు సత్తునాథ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చి ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తున్న ప్రభు మహరాజ్ కుటుంబం ఈ ఘటనతో ఒక్కసారిగా విషాదంలో చిక్కుకుంది. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఆరుగురిలో ముగ్గురు పరారయ్యారు. మిగిలిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతివేగం, అజాగ్రత్తే ఈ ఘోర ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Islamism Global Threat: ఇస్లాం ప్రపంచ భద్రతకు ముప్పు..అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ సంచలన ప్రకటన..
