Site icon NTV Telugu

Maheshwar Reddy: ఇంద్రకరణ్ రెడ్డి భూకబ్జాలపై చర్చకు రెడీ

టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. నిర్మల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజక వర్గ స్థాయి నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి ఏఐసీసీ తరఫున శ్రీనివాస కృష్ణన్, మాణిక్కం ఠాకూర్ హాజరయ్యారు.

సమావేశం లో ఏడు నియోజక వర్గాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ లో టీఆర్ఎస్ వైస్ చైర్మన్ ఒక ఎస్సీ మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్టు తెలిసింది. మంత్రి ఆలోచనలకు తగ్గట్లే ఆయన అనుచరులు సైతం అలానే ఉన్నారని మండిపడ్డారు మహేశ్వర్ రెడ్డి. మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి కబ్జాలకు సంబంధించి పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయ. ఇప్పటి వరకూ పదిహేను వందల ఎకరాలు భూ కబ్జాలు చేశారు. ఆయన కబ్జాల గురించి నిరూపించడానికి బహిరంగ చర్చకు సిద్ధం. సీఎం కేసీఆర్ వైఖరి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీలా వుందని విమర్శించారు మహేశ్వర్ రెడ్డి.

https://ntvtelugu.com/manickam-tagore-fired-on-bjp-and-trs/
Exit mobile version