NTV Telugu Site icon

Maheshkumar Goud: తెలంగాణలో పట్టపగలు భూదోపిడీ

Mahesh Tpcc

Mahesh Tpcc

రాష్ట్రంలో పట్టపగలు భూదోపిడీ చేసి కంపెనీలకు కట్టబెడుతున్నారు. పేదల భూమి లాక్కోవలని చూస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. 111 జీవో ఎత్తివేస్తే ఐదింతల భూమి రేటు పెరిగే అవకాశం ఉంది. పట్టపగలు భూ దోపిడీ జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. యాదగిరిగుట్ట చుట్టూ ఉన్న భూములు కేసీఆర్ కుటుంబ సభ్యులవే అన్నారు.

Revanth Reddy: ధాన్యం కొనుగోళ్ళపై రేవంత్ పది ప్రశ్నలు

ఈ భూములపై సమగ్ర దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇందిరాగాంధీ సీలింగ్ యాక్ట్ తెచ్చి రాష్ట్రంలో పివి నరసింహారావు హయాంలో పెద్దల భూములను పేదలకు పంచారు. ఇప్పుడు పేదల భూమిని పెద్దలకు కట్టబెడుతున్నారు. గత మూడేళ్ళుగా జరిగిన సంఘటనలు కోడికరించి ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయి.

పార్లమెంట్ అయిపోయిన తరువాత డోలు కొట్టి ధర్నా చేస్తున్నాడు కేసీఆర్. మొన్నటి వరకు ఎందుకు చేయలేదు..? కేసీఆర్ కి కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే గంటలో పరిష్కారం అయ్యే సమస్య ఇది. కరీంనగర్ రైస్ మిల్లర్ల చేతిలో కేసీఆర్ బందీ అయి ఈ నాటకం ఆడుతున్నారు. 1300 క్వింటాలుకు కొనే పరిస్థితి లేదు . ఇది 4500 కోట్ల కుంభకోణం.. రైస్ మిల్లర్లు పేద రైతుల నుండి దోచుకుంటున్నారన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇదే ధాన్యాన్ని రైస్ మిలర్లు FCI కి రూ.1900 కు అమ్ముతుందన్నారు.