Site icon NTV Telugu

TPCC Mahesh Goud : ఎస్పీబీ పేరుతో రాజకీయాలా..? మహేశ్ గౌడ్ కౌంటర్

Mahesh Goud

Mahesh Goud

TPCC Mahesh Goud : ప్రజాపాలన రెండేళ్ల వేడుకలను దారి మళ్లించే ప్రయత్నంలో ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు తెగబడుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్న ఆయన, అలాంటి పరిస్థితులు హైదరాబాద్‌లో రాకుండా ఉండేందుకు హీల్ట్ పాలసీని తీసుకొస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు.

Traffic Challan Discount : చలాన్లపై డిస్కౌంట్.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల ఉదాహరణతో మాట్లాడితే దాన్ని మతరాజకీయాలుగా మార్చడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. కుల, మతాల పేరుతో రాజకీయాలు చేయడం ప్రజలు ఒప్పుకోరని స్పష్టం చేసిన మహేశ్ గౌడ్, హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల పరిశ్రమల వికాసానికి అనుకూల వాతావరణం ఉందని అభిప్రాయపడ్డారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇన్ అండ్ ఔట్ భూములను ప్రైవేట్ వారికి అప్పగించినప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించిన ఆయన, ప్రస్తుతం ఆయన చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీ–బీఆర్ఎస్ రెండు ఒకే తీరుగా వ్యవహరిస్తున్నాయనే విషయాన్ని బయటపెడుతున్నాయని అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో విచ్చలవిడిగా దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ అంశాన్ని కుల, మత రాజకీయాలకు ఉపయోగించడం సరికాదని మహేశ్ గౌడ్ ఖండించారు. ఎస్పీబీ దేశం గర్వించే మహానీయ గాయకుడని, కళాకారులు సాహిత్యకారులకు కులం, మతం జోడించడం తగదని స్పష్టం చేశారు.

Brother vs Sister: సర్పంచ్ బరిలో అన్న, చెల్లెలు.. కట్ చేస్తే!

Exit mobile version