Site icon NTV Telugu

కాంగ్రెస్‌ నాయకుల కృషితోనే సభ్యత్వాల పూర్తి : మహేష్‌ గౌడ్‌

కాంగ్రెస్‌ నాయకుల కృషితోనే సభ్యత్వాలను పూర్తి చేశామని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ గౌడ్‌ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు 20 లక్షలు పూర్తి అయిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సభ్యత్వ నమోదును మరో నాలుగు రోజులు పొగిస్తున్నట్టు తెలిపారు. జనవరి 30 నాటికి 30 లక్షల సభ్యత్వం పూర్తి చేస్తామని మహేష్‌ గౌడ్ వెల్లడించారు. పార్టీ సభ్యత్వాల్లో టార్గెట్ పూర్తి చేయని వారిపై పార్టీ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.సభ్యత్వ నమోదును లైట్‌గా తీసుకున్న నాయకులపై పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు. ఇటీవల సమీక్ష సమావేశానికి రాని ఇన్‌చార్జ్‌లకు నోటీసులు పంపించినట్టు తెలిపారు. ఈ నెల 31న సమీక్షకు రాకుంటే పీసీసీ కమిటీలో చోటు ఉండదని స్పష్టం చేశారు. 2018లో పోటీ చేసిన వారు సభ్యత్వం టార్గెట్‌ పూర్తి చేయకుంటే పీసీసీలో నో ఛాన్స్‌ అని మహేష్‌ గౌడ్‌ తెలిపారు.

https://ntvtelugu.com/rewant-reddy-criticized-modi-and-kcr/


Exit mobile version