TPCC Mahesh Goud : కవిత రాజీనామాపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవిత కొన్ని కఠోర సత్యాలు, కొన్ని అబద్ధాలు మాత్రమే మాట్లాడారని ఆయన అన్నారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో కీలక స్థానంలో ఉన్న కవితకు అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం లేకుండా అవి జరిగాయని అనటం అసాధ్యమని విమర్శించారు. ప్రజల సొమ్ము దోచుకున్న తర్వాత, వాటాలో తేడా రావడంతోనే కవిత బహిరంగ వేదికపైకి వచ్చారని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు.
Nandigama : రూ.3.10 కోట్లు నోట్లతో అలంకరించిన గణపతి విగ్రహం
కవిత నిజంగా అవినీతి విషయాల్లో ఆధారాలు ఇస్తే వాటిని పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని PCC చీఫ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా లిక్కర్ మార్ట్ కేసు, ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రిపై ఎత్తేసిన కేసు వంటి అంశాలపై సరైన వివరాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కేసీఆర్‌పై స్పై చేయాల్సిన అవసరం లేదన్నారు. “స్పై చేయడం మాకు అలవాటు కాదు.. ఫోన్ ట్యాప్‌లు మీరు చేశారు. మీరు మీలో మీరే గొడవ పడి బయటపడుతున్నారు” అంటూ బీఆర్ఎస్ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. ఆయన కవిత ఇటీవలే అమెరికా నుండి తిరిగివచ్చిన తర్వాత హరీష్ రావు, సంతోష్‌పై ఆరోపణలు చేయడం, అంతకు ముందు కేటీఆర్‌పై విమర్శలు చేయడం బీఆర్ఎస్ లోపల విభేదాలను బహిర్గతం చేస్తోందని అన్నారు.
కవిత రాజీనామా చేయడాన్ని మహేష్ గౌడ్ స్వాగతించారు. నైతికతకు కట్టుబడి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడం శుభపరిణామమని అన్నారు. “కవిత కేసీఆర్ వదిలిన బాణం మాత్రమే. ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. అయితే నైతికతతో తీసుకున్న ఈ నిర్ణయం సానుకూలమే” అని వ్యాఖ్యానించారు. అంతేకాక, రాబోయే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ అనే పార్టీ రాజకీయ ముఖచిత్రంలో ఉండదని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.
బిఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది. కవిత, కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
