NTV Telugu Site icon

Mahesh Babu Daughter Sitara Emotional Video: నాన్నమ్మను చూసి బోరున ఏడ్చిన సితార

Mahesh Babu Daughter Sitara Emotional

Mahesh Babu Daughter Sitara Emotional

Mahesh Babu Daughter Sitara Emotional Video: చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సూపర్‌ స్టార్‌ కృష్ణ భార్య, మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి మరణించారు. ఆమె కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. ఇందిరాదేవిని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఇందిరాదేవి మరణించారు. తల్లిదండ్రులంటే మహేష్ బాబు కి అమితమైన ప్రేమ. అలాగే తల్లిదండ్రుల విషయం వచ్చే సరికి మహేష్ బాబు చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇక సితార, గౌతమ్ లకు కూడా నానమ్మ ఇందిరాదేవి అంటే చాలా ఇష్టం. టైం దొరికినప్పుడల్లా ఆమెతో కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఈనేపథ్యంలో.. ఇందిరాదేవి మృతితో కుటుంబ సభ్యులంతా శోక సముద్రంలో మునిగిపోయారు. నానమ్మను చూసి సితార బోరున ఏడ్చేసింది. నాయనమ్మ ఇకరాదంటూ తల్లి నంమ్రతాను పట్టుకుని ఏడ్చింది.

అక్కడకు వచ్చిన మహేషే సితారాను ఎంత కంట్రోల్‌ చేసిన సితార ఏడుస్తూనే వుంది. తన నానమ్మ అంటే తనకు ఎంతో ఇష్టమని సితార పలు మార్లు ప్రస్తావించింది కూడా. అయితే గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న నానమ్మను తరచూ తన తండ్రి మహేష్‌ బాబుతో వెళ్లి మాట్లాడి వచ్చేది. త్వరలో తను ఇంటి వస్తుందని ఎదురు చూస్తున్న సమయంలో నానమ్మ మృతి ఆచిన్నారికి కలిచివేసింది. నానమ్మను చూసి బోరుల విలపించింది. మహేష్‌ తల్లిసితార ఊరుకోమ్మ అంటున్న ఆచిన్నారి కంటి నుంచి కన్నీరు కారుతూనేవుండటం మహేష్‌ కంటతడిపెట్టించింది. ఆవీడియో చూసిన వారందరూ కన్నీరు పెడుతున్నారు. ఆచిన్నారికి నానమ్మ దూరమవడంతో ఎంత ఏడుస్తూందో.. సితారకు నానమ్మ అంటే ఎంతప్రేమో తెలుస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

కృష్ణ ఇందిరా దేవి కి 1961లో హీరో కృష్ణతో వివాహం జరిగింది. వీరికి రమేష్ బాబు, మంజుల, మహేష్ బాబు లు జన్మించారు. కృష్ణ ఆ తర్వాత 1969 లో విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక 2019లో విజయనిర్మల కన్నుమూసింది. ఆ తర్వాత లాక్ డౌన్ టైంలో మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా మరణించారు. ఇక ఇప్పుడిప్పుడే ఘట్టమనేని ఫ్యామిలీ చనిపోయిన వారి బాధ నుండి బయట పడుతున్న టైంలో ఇందిరాదేవి ఆరోగ్యం సీరియస్ అవ్వడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా కంగారు పడ్డారు. మెరుగైన చికిత్స కోసం ఇందిరాదేవిని ఆసుపత్రికి తరలించారు. కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్న ఆమె తెల్లవారుజామున మరణించినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో రెబల్‌ కృష్ణం రాజు మరణం తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిత్ర పరిశ్రమ ఇందిరాదేవి మరణంతో మళ్లీ తీవ్ర విశాదంలో వెల్లింది. త్వరలో ఇందిరాదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Show comments