NTV Telugu Site icon

MLA Laxmareddy: తగ్గని జోరు అదే హుషారు.. లక్ష్మారెడ్డి సమక్షంలో భారీ చేరికలు..

Mla Laxmareddy

Mla Laxmareddy

MLA Laxmareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దూసుకెళ్తున్నారు. గడప.. గడపకు తిరుగుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ప్రచారంలో లక్ష్మారెడ్డి జోరు తగ్గడం లేదు అదే హుషారుతో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నేడు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఖానాపూర్ గ్రామపరిధిలోని సోమ నాయక్ తండాలో ప్రచారం నిర్వహించారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో భారీగా చేరారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో 15మంది సోమ నాయక్ తండా వాసులు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ కండువాకప్పి ఘనంగా ఆహ్వానించారు లక్ష్మారెడ్డి. కార్యకర్తల హుషారు, నిరంతర చేరికలతో బీఆర్ఎస్ జోరు కొనసాగుతుంది. అభివృద్ధి సంక్షేమమే తమ ప్రధాన ఎజెండా అంటూ జెండాలన్నీ పక్కనపెట్టి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు.

ఖానాపూర్ గ్రామ పరిధి సోమ నాయక్ తండాకు చెందిన మాజీ వార్డు మెంబర్ మంజు నాయక్, తరుణ్, తులసిరామ్, హన్యతో సహా పలువురు 15 మందికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రానున్న 15 రోజులు చాలా కీలకమని ప్రతి కార్యకర్త నాయకుడు గత 9 ఏండ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలన్నారు. మరింత అభివృద్ధి సంక్షేమం ప్రజలకు చేరాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమని ప్రజలకు తెలపాలని కోరారు. ఇక రంగారెడ్డిగూడలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య అనుచర వర్గం 20 మంది ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పటికే జడ్చర్ల ఎంతో అభివృద్ధి చెందిందని, ఎన్నికల తరువాత మరింత అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని.. పని చేసే ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్‌ అధికారంలోకి రావాలన్నారు.
IND vs NZ: అప్పుడు తెలియదు.. రాత్రంతా మేల్కొని ఉన్నా: సత్య నాదెళ్ల