Errabelli Dayakar Rao: రుణ మాఫీ పై బ్యాంకర్ల మీద నిందలు మోపడం సరికాదని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రుణమాఫీ కానీ రైతుల ధర్నాలో పాల్గొన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బాంకర్లకు 17వేల కోట్ల రూపాయలు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.
Read also: Tollywood: టాలీవుడ్ టుడే ఆప్ న్యూస్.. జస్ట్ ఒక్క క్లిక్ తోనే…
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ కోసం 36 వేల కోట్ల రూపాయలు అవసరం, కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం 17 వేల కోట్ల రూపాయలు వరకే మాఫీ చేశారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసే వరకు, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బ్యాంకర్ల మీద నిందలు మోపడం సరి అయింది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ పై అధికారులతో సమస్య నిర్వహించి రైతులందరికీ షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
Indian ICC Presidents: ఇప్పటి వరకు ఎంతమంది భారతీయులు ICC ప్రెసిడెంట్ అయ్యారంటే..
