Husband selfie video: భార్య కాపురానికి రావడం లేదని భర్త పురుగుల మందు డబ్బాతో సెల్ఫీ వీడియో కలకలం రేపింది. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెందాడు. అత్తింటికి వెళ్లి పిలిస్తే వారు దూషించడంతో తీవ్ర మనస్థాపన గురైన అశోక్ అనే వ్యక్తి తన భార్యను ఉద్దేశించి సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నీ పైన నాకు ప్రేమ ఉంది.. నా పైన నీకు ప్రేమ ఉంటే చచ్చేముందన్నా రావాలంటూ సెల్ఫీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంక్యా తండాలో చోటుచేసుకుంది.
Read also: Allu Arjun: ‘ఆదిపురుష్’తో బన్నీ బిజినెస్…
మహబూబాబాద్ మండలంలోని ముత్యాలమ్మ తండాకు చెందిన బేబీని ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు బేబీ గర్భవతి కావడంతో పుట్టింటికి వెళ్ళింది నాలుగు నెలల క్రితం కొడుకు పుట్టాడు. అయితే అంతకు ముందు నుంచే భార్య భర్తల మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే భార్యను కాపురానికి తీసుకురావడం కోసం ఐదు రోజుల క్రితం అశోకు తన అత్తగారింటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్లిన అశోక్ ను భార్య బేబీ కుటుంబ సభ్యులు కలిసి దూషించారు. నానా మాటలు అని తన కూతురు అత్తింటికి పంపే ప్రశక్తే లేదని చెప్పారు. దీంతో అశోక్ అత్తింటి నుంచి బయటకు వచ్చి భార్యను చూసిన బేబీ తన వైపుకూడా చూడలేదు. ఇక చేసేది ఏమీలేక అశోక్ తన ఇంటికి వెనుతిరిగాడు.
ఇంటికి వచ్చిన అశోక్ పురుగుల మందు డబ్బాతో సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డడు. అశోక్ ను గుర్తించిన స్థానికులు మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అశోక్ పరిస్థితి విషమించడంతో వరంగల్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. అయితే అశోక్ తల్లిదండ్రులు తన కొడుకు చావుకు కారణం తన అత్త కుటుంబ సభ్యులు అని ఆరోపించారు. ఈ విషయమై మృతుడు తండ్రి రాములు పోలీసులకు పిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు భార్యతో పాటు అత్తమామనుపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనకు పెద్దదిక్కుగా వున్న కొడుకు అశోక్ కుటుంబానికి దూరం కావడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులను ఓదార్చడానికి ఎవరితరం కాలేదు.
Artificial Intelligence : ఏఐతో భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాలు.. ఆది నుంచే నియంత్రించాలంటున్న మేధావులు
