Madhuri Rathod : మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై సంచలన ఆరోపణలు

  • ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణ యత్నం
  • పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపణ
  • పోలీసుల తీరుపై మాధురి ఆవేదన
  • ఈశ్వర్ సాయిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
Madhuri Rathod

Madhuri Rathod

తెలంగాణ జానపద నృత్య కళాకారుల వర్గంలో తీవ్ర కలకలం రేగింది. ప్రముఖ ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. తనకు న్యాయం జరగడం లేదనే తీవ్ర తీవ్ర మనస్తాపంతో ఆమె ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి ప్రయత్నించారు. అయితే సకాలంలో స్పందించిన కుటుంబ సభ్యులు గది తలుపులు పగలగొట్టి ఆమెను కాపాడటంతో తృప్తిలో పెద్ద ప్రమాదం తప్పింది.

పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపణలు

జానపద పాటల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న డాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ మధ్య గత కొంతకాలంగా తీవ్ర వివాదం నడుస్తోంది. ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మాధురి గతంలోనే బహిరంగంగా ఆరోపించారు. వీరిద్దరూ ఒకే గదిలో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య వారిని పట్టుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ కావడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఈశ్వర్ సాయి తన వైపు తప్పులేదని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయగా, మాధురి మాత్రం అతడి మోసాన్ని ఎండగడుతూ పోలీసులను ఆశ్రయించింది.

పోలీసుల తీరుపై బాధితురాలి అసంతృప్తి

తమకు న్యాయం చేయాలని, నిందితుడైన ఈశ్వర్ సాయిపై కఠిన చర్యలు తీసుకోవాలని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు సరైన రీతిలో స్పందించలేదని మాధురి రాథోడ్ ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈశ్వర్ సాయికి కొమ్ము కాస్తూ, అతడిని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. న్యాయం కోసం ఎంత పోరాడినా ఫలితం లేకపోవడం, కేసు విచారణలో జాప్యం జరగడంతోనే తాను ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల డిమాండ్

నార్సింగి పోలీసుల నిర్లక్ష్య వైఖరి వల్లే మాధురి ఆత్మహత్యాయత్నానికి పూనుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి పేరుతో మోసానికి పాల్పడిన ఈశ్వర్ సాయిని వెంటనే అరెస్ట్ చేసి, బాధితురాలికి తగిన న్యాయం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నార్సింగి పీఎస్ లో మరో ఫిర్యాదు చేసింది మాధురి రాథోడ్.. సోషల్ మీడియాలో AI జనరేటెడ్ వీడియోలు వైరల్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది మాధురి. తన మొబైల్ దొంగిలించి ఈశ్వర్ సాయి భార్య పోస్టులు చేసిందని, వీడియోలను తనకు ట్యాగ్ చేసి పరువుకు భంగం కలిగిస్తున్నారని, తప్పుడు ట్రోలింగ్ చేస్తున్న యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.