NTV Telugu Site icon

Madhu Goud Yaskhi: కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా బొంద పెట్టాలి

Madhuyaskhi Goud

Madhuyaskhi Goud

Madhu Goud Yaskhi Comments On Kavitha ED Investigation: కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటోందని.. ఆ కుటుంబాన్ని రాజకీయంగా బొంద పెట్టాలని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మెన్ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల పోరాటాలను గుర్తించి, సోనియా గాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలను సోనియా సాకారం చేసిందన్నారు. రాజకీయంగా నష్టపోతామని తెలిసినప్పటికీ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆరోపణలు చేశారు. ఇసుక నుంచి మద్యం మాఫియా దాకా.. ఆ కుటుంబం వేలకోట్లు మిగుల్చుకుందని ఆరోపించారు. బతుకమ్మా పేరుతో బ్రతక నేర్చిన కల్వకుంట్ల కుటుంబం వేల కోట్ల గడించారన్నారు.

Arvind Kejriwal: పని చేయనివ్వండి.. ఢిల్లీ బడ్జెట్‌ను అడ్డుకోవడంపై కేంద్రంపై కేజ్రీవాల్ దాడి

ఫ్లైట్ టికెట్ కొనలేని స్థితి నుంచి నేడు ప్రత్యేక ఫ్లైట్‌లో చక్కర్లు కొట్టే స్థాయికి చేరుకున్నారని.. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని మధుయాష్కీ కోరారు. టానిక్ అనే పేరుతో చెట్ల సంతోష్ మద్యం తాగిస్తున్నాడని చెప్పారు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళతో ప్రారంభమైన కవిత మద్యం వ్యాపారం ఢిల్లీ వరకు విస్తరించిందని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ఎంపీలు ఎప్పుడైనా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారా? అని ప్రశ్నించారు. ఏ తప్పు చేయనపుడు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు? తప్పు చేయనప్పుడు భయమెందుకు? అని కవితను ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ పరిపాలనను పక్కకు తోసి.. కవిత రక్షణ సమితి (కేఆర్ఎస్)గా మారిందని మండిపడ్డారు. కవితకు రక్షణగా ఢిల్లీలో మంత్రులు వలయంగా మారారన్నారు. గవర్నర్‌పై పాడి కౌశిక్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే మహిళగా అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అని నిలదీశారు.

Actress Hema: యూట్యూబ్ ఛానెల్స్‌పై నటి హేమ ఫిర్యాదు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీ లబ్ధిదారుడు డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారని మధుయాష్కీ గుర్తు చేశారు. మరి.. ఈ వ్యవహారంలో మాస్టర్ మైండ్, కింగ్, క్వీన్ అయిన కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవితకు ఖరీదైన వాచ్‌లు, విల్లాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అని అడిగారు. తెలంగాణలో మద్యం సరఫరాపై కూడా ఈడి, సీబీఐ విచారణ జరగాలని మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనన్నారు. అదాని కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చదానికే.. ఈ ఢిల్లీ లిక్కర్ స్కాంని తెరమీదకి తీసుకొచ్చారని అభిప్రాయపడ్డారు. లండన్‌లో రాహుల్ గాంధీ ప్రస్తుత భారతదేశంలో ఉన్న పరిస్థితుల గురుంచి మాట్లారే తప్ప, దేశాన్ని కించపరిచేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు.