NTV Telugu Site icon

పెళ్ళికి పెద్దలు కాదన్నారని.. ప్రియురాలి హత్య!

హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పెళ్లికి పెద్దలు నిరాకరించారనీ ఆత్మహత్య యత్నం చేసింది జంట. అయితే ప్రియురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రియుడు గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఒంగోలు కు చెందిన నాగ చైతన్య , కోటి రెడ్డి ప్రేమించుకున్నారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా పని చేస్తోంది నాగ చైతన్య. మెడికల్ రెప్రజెంటేటివ్ గా చేస్తున్నాడు కోటి రెడ్డి. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించారు పెద్దలు.

చందా నగర్ లో లాడ్జ్ తీసుకుంది జంట. అయితే, ఏం జరిగిందో ఏమో ప్రియరాలిని హత్య చేసిన కోటి రెడ్డి లాడ్జ్ నుండి అదృశ్యమయ్యాడు కోటిరెడ్డి. ఒంగోలు లో ప్రత్యక్షమైన కోటి రెడ్డి వాలకం అనుమానాస్పదంగా వుంది. ఒంటి నిండా గాయాలతో ఒంగోలులో హాస్పిటల్ లో చేరాడు కోటి రెడ్డి. లాడ్జి నిర్వాహకుల ఫిర్యాదుతో చందా నగర్ లో కేస్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ఒంగోలు లో చికిత్స పొందుతున్న కోటి రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఇద్దరు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులకు చెబుతున్నాడు కోటి రెడ్డి. మరి నాగచైతన్యను ఎవరు హత్యచేశారో చెప్పడంలేదు.