Lok Sabha Elections: రాష్ట్రంలో నేటి నుంచి లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోపు 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను ఈనెల 29న ప్రకటిస్తారు. మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. కాగా.. ఈ ఎన్నికల్లో 3.30 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనుండగా.. వారి కోసం 35 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియకోసం పోలింగ్ సిబ్బంది 1.80 లక్షల మంది, 25 వేల మంది ఇతర సిబ్బందిని ఏర్పటు చేశారు.
Read also: Rishabh Pant: ఐపీఎల్‌లో రిషబ్ పంత్ అరుదైన ఘనత!
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. 60 వేల మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో రెండు ఎస్టీ, మూడు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. లోక్‌సభ స్థానాలకు ఈవీఎంలపై తెల్లటి బ్యాలెట్ పేపర్లు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లను ఉపయోగిస్తారు. అయితే ఇవాళ లోక్‌సభతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికకు కూడా పోలింగ్ జరగనుంది. నియోజకవర్గంలో 2.51 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 232 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
Read also: Dubai : వారు చేసిన తప్పిదమే దుబాయ్ విపత్తుకు కారణమా.. తేల్చి చెప్పిన సైంటిస్టులు
కాగా.. నామినేషన్ ప్రక్రియ మొత్తం రికార్డ్ చేయబడుతుంది. అభ్యర్థితో పాటు గరిష్టంగా ఐదుగురు వ్యక్తులను రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతిస్తారు. నామినేషన్‌ను ఆన్‌లైన్‌లో కూడా చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ, ప్రింటెడ్ కాపీని ఆర్‌వోకు సమర్పించాలి. ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో 85 ఏళ్లు పైబడిన వారికి, వికలాంగులకు ఇంటింటికి ఓటు వేసే సౌకర్యం కల్పించారు. రాష్ట్రంలో వీరి సంఖ్య 7.19 లక్షల వరకు ఉంది. మే 8లోపు వారు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.
Read also: Astrology: ఏప్రిల్ 18, గురువారం దినఫలాలు
తెలంగాణలో ఓటర్ల సంఖ్య మొత్తం 3,30,21,735 వుండగా.. పురుషుల సంఖ్య 1,64,31,777 ఉంది.. ఇక స్త్రీలు; 1,65,87,221 కాగా.. మూడవ లింగం; 2,737 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో నేటి నుంచి ఓటింగ్ ముగిసే వరకు తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. బ్యాంకుల నుంచి లక్షలు, అంతకంటే ఎక్కువ విత్‌డ్రా చేసినా, డిపాజిట్ చేసినా ఆ ఖాతాలపై నిఘా పెట్టారు. రూ. 10 లక్షలకు మించి డ్రా చేస్తే ఐటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. తనిఖీల్లో దొరికిన డబ్బుకు సంబంధించిన రుజువు చూపిస్తే వాపసు ఇస్తున్నారు.
Vikas Raj : నామినేషన్ల స్వీకరణ ప్రక్రియపై సీఈవో వికాస్ రాజ్ సమీక్ష
