NTV Telugu Site icon

లాక్ డౌన్ మరింత కఠినం… రాత్రి సమయంలో మాత్రమే వాటికి అనుమతి… 

మే 13 నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.  ఈనెల 30 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే.  అయితే, తెలంగాణలో కేసులు తక్కువగా నమోదవుతున్నా, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేసేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధం అయ్యింది.  ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఈరోజు నుంచి సరుకు రవాణా వాహనాలకు అనుమతి నిరాకరించారు.  రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే సరుకు రవాణాకు అనుమతించారు.  యథావిధిగా మెడిసిన్, ఆక్సిజన్ సిలిండర్లు, డొమెస్టిక్ గ్యాస్ కు అనుమతించారు.  ఇక ఫుడ్ డెలివరీ సేవలకు కూడా పోలీసులు అనుమతించారు.